రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే పైన్ వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన మొత్తం ద్వారా మూడేళ్లలో రైల్వే శాఖకు వచ్చిన ఆదాయం అక్షరాలు రూ.1,377 కోట్లు. టిక్కెట్‌లెస్ ద్వారా వచ్చిన ఆదాయం 2016 నుంచి 2019 మధ్య 31 శాతం పెరిగింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్పటికీ, దాని ద్వారా ఆదాయం కోల్పోవడంపై 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ఫైనాన్షియల్ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో టిక్కెట్‌లేని ప్రయాణంపై చర్యలు వేగవంతం చేయాలని, ప్రతి టీటీఈకి వార్షిక టార్గెట్ నిర్దేశించాలని సూచించింది.

టిక్కెట్ లేని ప్రయాణానికి జరిమానా
రైల్వే ఫైన్లపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త రైల్వే బోర్డుకు దరఖాస్తు చేశారు. 2016-17 సంవత్సరంలో టికెట్ లేకుండా ప్రయాణించి వారి నుంచి రూ. 405.30 కోట్లు, 2017-18లో రూ.441.62 కోట్లు, 2018-19లో రూ. 530.06 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారని తెలిపింది.

ఇజ్రాయెల్ జనాభా కంటే ఎక్కువ..
ఈ మూడేళ్ల కాలంలో రూ.1,377 కోట్లు వసూలైనట్లు తెలిపింది. 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి మధ్య టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసిన వారి సంఖ్య 8.9 మిలియన్లు. ఇది ఇజ్రాయెల్ జనాఫా కంటే ఎక్కువ.

టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే...
టిక్కెట్ లేని ప్రయాణానికి టిక్కెట్ రేటుతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. టిక్కెట్ తీసుకోని వ్యక్తి జరిమానా తీసుకోవడానికి అంగీకరించని పరిస్థితుల్లో లేదా ఆ జరిమానాను చెల్లించని సందర్భాల్లో రైల్వే పోలీసులకు అప్పగిస్తారు. రైల్వే యాక్ట్ సెక్షన్ 137 కింద బుక్ చేసి, అతన్ని కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేరాలకు పాల్పడి కోర్టుకు వెళ్తే జడ్జి రూ.1000 వరకు జరిమానా విధిస్తారు. కోర్టు విధించిన జరిమానా కూడా కట్టని పరిస్థితుల్లో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications