టీవీల ఉత్పత్తిలోనూ కోత పడుతోంది...ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పు ?
సాధారణంగా పండగ సీజన్ వస్తోందంటే అనేక రకాల ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రొడక్షన్ ను పెంచుతుంటాయి. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలైన సోనీ, పానాసోనిక్, బీపీఎల్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని లేదా దిగుమతులను 20 శాతం మేర తగ్గించుకున్నట్టు సమాచారం.ఇటీవలి కాలంలో అమ్మకాలు తగ్గిపోవడం మూలంగా కంపెనీల వద్ద నిల్వలు పేరుకు పోయాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొనే కంపెనీలు ఉత్పత్తిలో కోత పెడుతున్నట్టు సమాచారం. గత జూన్, జులై నెలల నుంచే ఉత్పత్తిని కంపెనీళ్లు తగ్గిస్తున్నాయట.

వృద్ధి కనిపించలేదు
* సాధారణంగా పండగల సీజన్ లేదా క్రికెట్ సీజన్లో టీవీల అమ్మ కాలు జోరుగా సాగుతాయి. అయితే ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ఉన్నప్పటికీ టీవీల అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించక పోవడంతో కంపెనీల ఆశలు చెదిరిపోయాయి. పానాసోనిక్ టీవీల ఉత్పత్తిని 10-15 శాతం తగ్గించినట్టు కంపనీని అధికార వర్గాలు చెబుతున్నాయి.
* బీపీఎల్ ఇండియా కూడా ఉత్పత్తిని 15-20 శాతం వరకు తగ్గించుకుందట.
* శాంసంగ్, ఎల్జీ వంటి కంపెనీలు కూడా తమ ఉత్పత్తి విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. శాంసంగ్ వియత్నామ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

వాషింగ్ మిషన్ల పరిస్థితి కూడా...
* టీవీల మాదిరిగానే వాషింగ్ మిషన్లకు కూడా గిరాకీ తగ్గిపోయిందట. వర్షాకాలంలో వాషింగ్ మిషన్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సారి జులైలో అమ్మకాలు నిరాశాజనకంగానే ఉన్నాయట.
* ఒకవేళ ఆగష్టు నెలలో అమ్మకాలు పుంజుకోకపోతే వీటి ఉత్పత్తిలోనూ కోత పడవచ్చని అంటున్నారు.

పండగ సీజన్ పై ఆశలు..
* వచ్చే నెల నుంచి పండగల సీజన్ ప్రారంభం కానుంది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి వాటి మూలంగా టీవీల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీలు కొండంత ఆశతో ఉన్నాయి.

ఏసీలకు గిరాకీ..
* ఈసారి ఎండాకాలంలో టీవీలకన్నా ఎయిర్ కండీషనర్లకు డిమాండ్ జోరుగా పెరిగింది. మార్చినుంచి మే వరకు ఏసీ ల అమ్మకాల్లో 30 శాతం వరకు వృద్ధి నమోదైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* రిఫ్రిజిరేటర్ల అమ్మకాల్లో 13 శాతం వృద్ధి నమోదైంది.

ఉద్యోగాలు గల్లంతు...
* ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు తగ్గడంవల్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. దింతో లక్షలాది మంది ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పుడు టీవీలు ఇతర ఉత్పత్తుల తయారీ కంపెనీలు ప్రొడక్షన్ను తగ్గిస్తే భారీగా ఉద్యోగాలు గల్లంతు అవుతాయన్న ఆందోళను వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications