న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 1.2 శాతం పెరిగి ఔన్స్ ధర $1,544కు చేరుకుంది. భారత్‌లో రూ.39 వేల పై చిలుకు నుంచి రూ.40 వేల పై చిలుకు వరకు పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా అనేది అందరినీ వేధించే ప్రశ్న. బంగారంపై దీర్ఘకాలానికి పెట్టుబడి పెడితే నష్టమేమీ లేదనేది కొందరి మాట.

బంగారంపై పెట్టుబడి మంచిదేనా?
బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే పసిడి ధర ఎప్పటికప్పుడు పెరిగేదే కాబట్టి ఇన్వెస్ట్ చేస్తేనే మంచిదని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి పడిపోతే కొద్దిగా బలహీనపడుతుందని, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు లేదా కొద్ది నెలలు తప్పితే దీర్ఘకాలంలో చూసినా బంగారంపై పెట్టుబడి మంచిదేనని చెబుతున్నారు.

ఇదే పరిస్థితి ఉండవచ్చు
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బంగారం ధర ఆరు సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. మరోవైపు రూపాయి బలహీనపడుతోంది. దీంతో పసిడి దిగుమతుల కాస్ట్ ఎక్కువ అవుతోంది. బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరుకుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధర ప్రస్తుత పరిమాణాన్నే కొనసాగిస్తుందని రిలయన్స్ కమోడిటీస్ ప్రతిమా కుమార్ పట్నాయక్ అన్నారు.

ఎక్కువగా పెట్టుబడి వద్దు...
ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ ఫండ్, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్కువగా పెట్టుబడి పెట్టకపోవడం మంచిదని భావిస్తున్నారు. బంగారం ధరలు హఠాత్తుగా పెరిగాయని, కాబట్టి వీటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవద్దని సూచిస్తున్నారు. అయితే బంగారంపై 5-10 శాతం పెట్టుబడి పెడితే చాలని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ధర
సాధారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. వరుసగా తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2008లో గ్లోబల్ క్రైసిస్ సమయంలో బంగారం ఉపయోగపడిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే భారీగా ధరలు పెరిగినందున ఆలస్యమైందని అంటున్నారు. అలాగే స్వల్పకాలంలో మంచి యావరేజ్ రిటర్న్స్ రావని అంటున్నారు. అదే సమయంలో బంగారంలో పెట్టుబడి మరీ చెడ్డదేమీ కాదని, కానీ పరిమితి ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ మీరు నిత్యం గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లలో తేలియాడుతుంటే కనుక ఇంటర్నేషనల్ ఈక్విటీలను చూడవచ్చునని చెబుతున్నారు. బంగారం ధర ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది.

గత వందేళ్లలో బంగారం ధర పెరుగుదల ఇలా....
ప్రస్తుతం బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరుకుంది. గత వందేళ్లలో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.. 1911లో రూ.15.50, 1921లో రూ.16.40, 1931లో రూ.18.18, 1941లో రూ.37.47, 1951లో రూ.98,
1961లో రూ.119, 1971లో రూ.193, 1981లో రూ.1,700, 1991లో రూ.3,466, 2001లో రూ.4,300, 2011లో రూ.26,400, 2012లో రూ.32 వేలు, 2019లో రూ.39,000 మార్క్ దాటింది.

క్యాలెండర్ ఇయర్లో తగ్గుదల
గత యాభై ఏళ్ళలో బంగారం (ఓన్స్ ధర డాలర్లలో) పెరుగుదలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం పెరిగింది. అయితే కొన్ని క్యాలెండర్ ఇయర్లలో మాత్రం పెరుగుదలతో పాటు తగ్గుదల ఉంది. ఓ ఏడాదిలో ఎక్కువగా పెరిగి, తక్కువ ధర పలికిన సంవత్సరాలు ఇవే... 1969లో 16.07%, 1975లో 25.20%, 1976లో 4.06%, 1981లో 32.15%, 1983లో 14.84%, 1984లో 19.00%లో తగ్గింది.

వరుసగా పడిపోయిన బంగారం ధరలు...
1988 నుంచి 1992 వరకు వరుసగా బంగారం ధరలో తగ్గుదల ( ఆ క్యాలెండర్ ఇయర్‌తో పాటు మొత్తం ధర కూడా తగ్గింది) కనిపించింది. 1993లో మళ్లీ పెరిగినప్పటికీ, తిరిగి 1994లో తగ్గింది.

వరుస తగ్గుదలలు...
1988లో 15.69%, 1989లో 2.23%, 1990లో 2.49%, 1991లో 9.62%, 1992లో 5.80%, 1994లో 2.09% తగ్గింది. ఆ తర్వాత మళ్లీ 1996 నుంచి వరుసగా మూడేళ్ల పాటు తగ్గుదల కనిపించింది. 1996లో 4.43%, 1997లో 21.74%, 1998లో 0.61% తగ్గుదల ఉంది. 199లో బంగారం ధర 1 శాతం పెరిగినప్పటికీ ఆ తర్వాత 2000 సంవత్సరంలో 6.26% తగ్గింది.

వరుసగా పదమూడేళ్ల పాటు పెరిగిన బంగారం ధర
ఆ తర్వాత వరుసగా పదమూడేళ్ల పాటు బంగారం ధరలు పెరిగాయి. 2007లో అత్యధికంగా 31 శాతానికి పైగా పెరిగింది. 2001లో అత్యల్పంగా 1.741 శాతం పెరిగింది. మళ్లీ బంగారం ధర 2013లో భారీగా పడిపోయింది.

మళ్లీ తగ్గుదల..
2013లో బంగారం ధర 27.79% పడిపోయాయి. 2014లో 0.19%, 2015లో 11.59%, 2018లో 1.15% పడిపోయింది. మొత్తంగా బంగారం ధర గత యాభై ఏళ్లలో అంటే 1969లో ఔన్స్ ధర 41.10 డాలర్లుగా ఉండగా, ఇప్పుడు దాదాపు 350 నుంచి 400 రెట్ల వరకు పెరిగింది.
More From GoodReturns

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications