భారత జీడీపీ వృద్ధి రేటు 2019 సంవత్సరంలో 6.2 శాతంగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. బలహీనమైన నియామకాలు, గ్రామీణ భారతంలో ఆర్థిక ఒత్తిడి, కఠినమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జీడీపీ అంచనాను గతంలోని 6.8 శాతం నుంచి 6.2 శాతానికి సవరించింది. 2020లో 6.7 శాతంగా అంచనా వేసింది. ఇందులో 0.6 శాతం కోతను విధించింది.
ఆటోరంగంలో ఆర్థిక మందగమనం, ఎఫ్ఎంసీజీ సంక్షోభం, నియామకాలు తగ్గడం, ఉద్యోగాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల తర్వాత మూడీస్ 2019కి సంబంధించి వృద్ధి రేటును 6.2 శాతానికి తగ్గించింది. స్థిరమైన ప్రభుత్వ, ప్రయివేటు కన్సప్షన్ ఉన్నప్పటికీ బలహీనమైన వాణిజ్యం, పెట్టుబడుల ఒత్తిడి అంశాలు జీడీపీపై పడతాయని తెలిపింది.

బాహ్య ఒత్తిళ్లను పక్కన పెడితే, బలహనమైన నియామకాలు, గ్రామీణంలో ఆర్థిక ఇబ్బందులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఒత్తిడి కారణంగా కఠినమైన ఫైనాన్సింగ్ పరిస్థితులు వంటి అంశాల కలియిక కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో ఏసియా ఎక్స్‌పోర్ట్స్ తగ్గాయని, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది.
డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ భారత వృద్ధి రేటుపై గణనీయంగా పడుతుందని మూడీస్ పేర్కొంది. బిజినెస్ సెంటిమెంట్ మోడరేషన్, కార్పోరేట్‌లకు స్లో క్రెడిట్ ప్రవాహం, దేశంలోని పెట్టుబడులు బలహీనపడటానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. 2017లో భారత వృద్ధి రేటు 6.9 శాతం, 2018లో 7.8 శాతంగా మూడీస్ అంచనా వేసింది.
కాగా, ఇటీవలే మరో రేటింగ్ సంస్థ క్రిసిల్ కూడా భారత జీడీపీ వృద్ది అంచనాలను సవరించింది. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.1శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలున్నాయని క్రిసిల్ అంచనా వేసింది. ఆ తర్వాత దానిని 6.9 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications