For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగస్ట్ 26 నుంచి ఉదయం 7 గంటల నుంచే RTGS సేవలు

|

ముంబై: రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) సమయాన్ని పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నాడు వెల్లడించింది. ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సుఫర్‌ను ఈ నెల 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచే నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ప్రస్తుతం ఆర్టీజీఎస్ కింద వినియోగదారులు ట్రాన్సాక్షన్స్‌ను ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 వరకు, ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి గం.7:45 నిమిషాల వరకు అందుబాటులో ఉన్నాయి. నెఫ్ట్ కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేస్తోంది. నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు నగదు మాత్రమే బదలీ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షలకు పైబడి ఎంతైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.

<strong>ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్</strong>ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్

RTGS system for customer transactions to open at 7 am from August 26

ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ కోసం మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సమయాన్ని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో నెఫ్ట్ విషయంలోను ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నెఫ్ట్‌ను 24X7 వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రమోట్ చేసే క్రమంలో భాగంగా నెఫ్ట్ ట్రాన్సుఫర్స్ రౌండ్ ది క్లాక్ నిర్వహించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపింది. ఇది డిసెంబర్‌లో అమలు కానుంది.

English summary

ఆగస్ట్ 26 నుంచి ఉదయం 7 గంటల నుంచే RTGS సేవలు | RTGS system for customer transactions to open at 7 am from August 26

Transfer of funds through the high-value RTGS system will be available from 7 am instead of 8 am from August 26, the Reserve Bank of India said on Wednesday. At present, the Real Time Gross Settlement (RTGS) System is available for customer transactions from 0800 hours to 1800 hours and for inter-bank transactions from 0800 hours to 1945 hours.
Story first published: Thursday, August 22, 2019, 10:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X