2016లో నోట్లరద్దు సమయంలో పలువురి ఖాతాల్లో వారికి తెలియకుండా.. అక్రమంగా నగదు చేరినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నల్లధనాన్ని చట్టబద్దంగా మార్చుకోవడానికి జన్ ధన్ ఖాతాలను ఎక్కువగా వినియోగించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఖాతాదారులకు తెలియకుండానే అమౌంట్ పడిపోయింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఖాతాదారులకు తెలియకుండా వారి అకౌంట్‌లో డబ్బులు వేయలేని నిబంధనలు తీసుకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో తెలిపారు. ఈ మేరకు తాజాగా ఈ అంశంపై ఆర్బీఐకి లేఖ రాశారు.

ట్రాన్సాక్షన్ అనుమతి/తిరస్కరణ
ఎవరి అకౌంట్‌లోనైనా అమౌంట్ క్రెడిట్ అయితే వారికి తెలిసి జరగాలని, తమ అకౌంట్‌లోకి ట్రాన్సాక్షన్ తిరస్కరించాలా లేదా అనుమతించాలా హక్కు అకౌంట్ హోల్డర్ కలిగి ఉండేలా నిబంధనలు ఉండాలని, దీనిపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాన్ని కోరింది.

అధికారి ఏం చెప్పారంటే...
నూతన విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తామని, వారు అనుమతిస్తే డబ్బులు డిపాజిట్ అవుతాయని ఈ అంశంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. లావాదేవీని అనుమతించడం/తిరస్కరించడం ఖాతాదారుడి అభీష్టానికే వదిలేయబడుతుందన్నారు.

అందరికీ అందుబాటులోకి రాదా?
కేంద్రం అడుగుల నేపథ్యంలో ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ వేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి తీసుకునే విధానం త్వరలో బ్యాంకులు తీసుకు రానున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సేవలు పొందేందుకు బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఖాతాదారుడికి తన అకౌంట్‌కు సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉంటే జమ చేయవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications