న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీ ఎత్తున అక్రమ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్ లిస్టును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్యాక్స్ కమిషనర్లకు ఈ చెక్ లిస్టును పంపించింది. నోట్ల రద్దు సమయంలో లెక్కలోకిరాని డబ్బుని ఎవరు డిపాజిట్ చేశారో ట్రాక్ చేయాలని సూచించింది.

చెక్ లిస్ట్
నోట్ల రద్దు సమయంలో లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నట్లు సంబంధిత శాఖలు తెలిపాయి. ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, ఆదాయపన్ను ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ (CBDT) ఈ మేరకు సూచనలు జారీ చేసింది. నోట్ల రద్దుకు సంబంధించిన కేసుల నిర్వహణ కొనసాగించడంలో, క్యాష్ డిపాజిట్ చెక్ లిస్ట్ వెరిఫికేషన్ తయారు చేసినట్లు పేర్కొంది.

ట్యాక్స్ పేయర్ నిజాయితీ నిరూపించుకునే నిబంధన...
ట్యాక్స్ పేయర్ తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచినట్లు తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 31, 2016 వరకు జరిగిన ట్రాన్సాక్షన్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో వ్యాట్ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షిస్తారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ జరిగితే జరిమానా విధించవచ్చునని చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు.

చెక్ లిస్టులో ఇవీ...
చెక్ లిస్టులో... రిటర్న్ ఫైలింగ్ కంప్లియెన్స్, 2016-17లో ట్యాక్స్ పేయర్ ఆదాయం, 2016-17లో ట్యాక్స్ పేయర్ గ్రాస్ టోటల్ ఇన్‌కం (ఎక్సెంప్షన్ ఆదాయం కలుపుకొని), గ్రాస్ టోటల్ ఇన్‌కం ఆధారంగా డిపాజిట్ చేసిన నగదు శాతం (ఎక్సెంప్షన్ ఆదాయం కలుపుకొని) వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications