హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా భాగ్యనగరంలో ప్రారంభమైన ఐకియా ఫర్నీషింగ్ స్టోర్ తాజాగా తెలంగాణవారికి బంపరాఫర్ ప్రకటించింది. ఐకియా తన తొలి వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన కుటుంబాలకు స్వీడన్ టూర్ ఆఫర్ ఇస్తోంది. తన కస్టమర్లకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇది అందరికీ కాదు. ఎంపిక చేసే పద్ధతి ఉంది.

ఆగస్ట్ 18, 2019 తేదీలోగా రిజిస్ట్రేషన్
ఆగస్ట్ 18, 2019 తేదీలోగా ప్యామిలీ మెంబర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని స్టోర్‌లో కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. సభ్యత్వ కార్డు తీసుకొని ఆ తర్వాత తమ అనుభూతులు, ఫోటోలను ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుంచి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్ సైట్‌లో ఓటింగ్ పెడతారు. ఫోటో తీసుకొని, దానిని ఐకియా ఫ్యామిలీ పేజీలో షేర్ చేయాలి.

స్వీడన్‌లో వారు 6 పగళ్లు, 5 రాత్రులు
ఈ ఓటింగ్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాగుతుంది. ఈ ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన ఫ్యామిలీలను స్వీడన్ పర్యటనకు తీసుకు వెళ్తుంది ఐకియా. స్వీడన్‌లో వారు 6 పగళ్లు, 5 రాత్రులు గడపవచ్చు. అక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశముంటుంది. మీకు నచ్చిన తేదీలో ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే వెసులుబాటు ఉంది.

తెలంగాణవాసులు మాత్రమే ఆఫర్
ఈ ఆఫర్ కేవలం తెలంగాణవాసులకు మాత్రమే వర్తిస్తుంది. మీకు నచ్చిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలి. చెకవుట్ టైంలో ప్యామిలీ మెంబర్ షిప్ కార్డును స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఈ ప్రాడక్టుతో తమ అనుభవాలు తెలియజేస్తూ ఓ స్టోరీ రాసి దానిని ఫ్యామిలీ పేజీలో షేర్ చేయాలి. ఎక్కువ లైక్స్ వచ్చిన స్టోరీ పంపిన వారికి స్వీడన్ వెళ్లే అవకాశం దక్కుతుంది.
ఐకియా 2018 ఆగస్ట్ 9వ తేదీన ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి, భాగ్యనగరంలో స్టోర్ తెరిచింది. ఐకియా స్వీడిష్‌కు చెందిన మల్టీనేషనల్ గ్రూప్.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications