న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ ప్రమోటర్.. భారతీ టెలికంలో సింగపూర్‌కు చెందిన టెలికాం మేజర్ సింగ్‌టెల్ తన వాటాను 50% పెంచుకోనుంది. దీంతో ఎయిర్‌టెల్ విదేశీ కంపెనీ కావడంతో పాటు భారత్‌లో ఒక విదేశీ కంపెనీ టెలికం సేవలు అందిస్తున్నట్లవుతుంది. బీఎస్ఈ డేటా ప్రకారం ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికంకు 41% వరకు వాటా ఉంది. అలాగే, భారతీ టెలికంలో 52% శాతం వరకు వాటా ఉంది. ఇప్పుడు సింగ్‌టెల్ తన వాటాను పెంచుకోనుంది.

ఎయిర్‌టెల్ విదేశఈ కంపెనీ
రుణాల నుంచి విముక్తి పొందడం కోసం ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ (విదేశీ కంపెనీతో పాటు), సింగ్‌టెల్ ఈక్విటీలు పెంచుకోవచ్చునని భారతీ టెలికం లిమిటెడ్ (భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ ప్రమోటర్) పేర్కొంది. భారతీ టెలికంలో విదేశీ పెట్టుబడులు యాభై శాతానికి మించి పెరుగుతాయని, దీంతో ఇది విదేశీ కంపెనీ అవుతుందని, ఓసారి అది జరిగితే భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికంకు ఉన్న మొత్తం వాటా కూడా విదేశీ వాటా కింద పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది.

85 శాతానికి పెట్టుబడులు
ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో ఫారన్ షేర్ హోల్డింగ్స్ 43 శాతం ఉన్నాయి. సింగ్‌టెల్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత విదేశీ పెట్టుబడులు దాదాపు 85% వరకు పెరుగుతాయి. సమాచారం మేరకు 100% ఫారన్ డైరెక్ట్ పెట్టుబడుల కోసం (FDI) భారతీ ఎయిర్‌టెల్ రెండోసారి దరఖాస్తు చేసుకుంది. డిపార్టుమెంట్ ఆఫ్ టెలికం ఈ ఏడాది ప్రారంభంలో భారతీ ఎయిర్‌టెల్ FDI దరఖాస్తును తిరస్కరించింది. ఫారన్ ఇన్వెస్టర్ విషయంలో క్లారిటీ లేదంటూ దీనిని తిరస్కరించింది.

సింగ్ టెల్ వాటా 52 శాతం
విదేశీ పెట్టుబడుల విషయంలో భారతీ ఎయిర్‌టెల్ రెగ్యులేటరీ పాలనకు కట్టుబడి ఉందని, తదనుగుణంగా 100 శాతం విదేశీ పెట్టుబడుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రతిపాదిత పెట్టుబడుల ప్రకారం భారతీ ఎయిర్ టెల్ లో సింగ్‌టెల్ వాటా 52 శాతం ఉంటుంది. దీని వల్ల ఎయిర్ టెల్ లో విదేశీ పెట్టుబడుల శాతం 85 శాతం వరకు చేరుకుంటుంది. సింగ్ టెల్ ప్రస్తుతం 35 శాతం వాటాను కలిగి ఉంది.

52 శాతానికి సింగ్ టెల్ వాటా
సింగ్ టెల్ పెట్టుబడిని రుణ భారం తగ్గించుకునేందుకు భారతీ ఎయిర్ టెల్ వినియోగించనుంది. 30 జూన్ 2019 నాటికి ఎయిర్ టెల్ కన్సాలిడేటెడ్ నెట్ డెబిట్ రూ.1,16,645.8 కోట్లు. ఏదైనా కంపెనీలో యాభై శాతానికి మించి విదేశీ పెట్టుబడులు ఉండాలంటే FDI అప్రూవల్ అవసరం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications