For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్, వాణిజ్యం బంద్

|

ఇస్లామాబాద్/ఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు అనంతరం పాకిస్తాన్.. భారత్‌పై గుర్రుగా ఉంది. భారత్‌కు సంబంధించిన భూభాగంపై పాక్ స్పందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దూకుడు చూపవద్దని, భారత్‌పై ప్రతీకారానికి చూడవద్దని అమెరికాకు చెందిన ఇద్దరు డెమొక్రటిక్ లామేకర్స్ పాకిస్తాన్‌కు సూచించారు. ఇస్లామాబాద్‌లోని భారత్ రాయబారిని బహిష్కరిస్తూ పాక్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో అమెరికా చట్టసభ సభ్యులు ఈ సూచన చేశారు. సెనేటర్ రాబర్డ్ మెనెండ్జ్, కాంగ్రెస్‌మెన్ ఎలియోట్ ఏంజిల్ పై సూచన చేశారు.

<strong>ఇన్‌సైడర్ ట్రేడింగ్: ఈ సమాచారం ఇస్తే రూ.1 కోటి వరకు రివార్డ్</strong>ఇన్‌సైడర్ ట్రేడింగ్: ఈ సమాచారం ఇస్తే రూ.1 కోటి వరకు రివార్డ్

పాక్ ఆక్రోషం

పాక్ ఆక్రోషం

భారత భూభాగానికి చెందిన జమ్ము కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ నిరసన వ్యక్తం చేసింది. తమ దేశంలోని భారత రాయబారి అజయ్ బిసారియాను బహిష్కరించింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఆగస్ట్ 14న కాశ్మీరీలకు సంఘీభావం ప్రకటిస్తామని, 15న బ్లాక్ డే నిర్వహిస్తామని తెలిపింది. తద్వారా భారత్‌పై ఆక్రోషం వెళ్లగక్కింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల్ని తగ్గించుకోవాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించడం గమనార్హం.

ఇక రాయబారులు ఉండరు..

ఇక రాయబారులు ఉండరు..

ఇక తమ రాయబారులు ఢిల్లీలో ఉండరని, అలాగే పాకిస్తాన్‌లోని భారత రాయబారిని వెనక్కి పంపుతాని పాక్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషి అన్నారు. ప్రస్తుతం భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పాక్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్ హైకమిషనర్ మొయిన్ ఉల్ హక్ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. ఆయనను భారత్ పంపించరాదని నిర్ణయించింది. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ఐక్య రాజ్య సమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేసి భారత్ తనకు తానే హానీ చేసుకుందని తెలిపింది.

ద్వైపాక్షిక సంబంధాల పునఃసమీక్ష

ద్వైపాక్షిక సంబంధాల పునఃసమీక్ష

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌తో దౌత్య సంబంధాలను చాలా తక్కువ స్థాయిలోనే జరపాలని ఈ సమావేశం నిర్ణయించిందని, ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్షించాలని తీర్మానించినట్లు పాక్ పేర్కొంది. వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దౌత్యసంబంధాల్ని తగ్గించాలన్న నిర్ణయం వెలువడిన కాసేపటికే భారత హైకమిషనర్ బహిష్కరణపై ఉత్తర్వులు వచ్చాయి. 2001లో ఢిల్లీలో పార్లమెంటుపై ఉగ్రదాడి అనంతరం 2002లో భారత్.. పాక్‌లోని మన రాయబారిని వెనక్కి పిలిపించింది. ఆ తర్వాత పాక్ రాయబారిని బహిష్కరించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత్‌కు సంబంధించిన అంశంపై ఇండియన్ రాయబారిని బహిష్కరించడం గమనార్హం.

పాక్ నిర్ణయంతో నష్టమా?

పాక్ నిర్ణయంతో నష్టమా?

భారత్‌తో వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు పాక్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవాల్సిన తరుణంలో పాక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఈ నిర్ణయం వల్ల మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యం చాలా తక్కువ అన్నారు. కాబట్టి పాక్ నిర్ణయం వల్ల వచ్చే నష్టం లేదన్నారు.

లోయలో నిత్యావసర వస్తువుల పంపిణీ

లోయలో నిత్యావసర వస్తువుల పంపిణీ

మరోవైపు, పఠాన్‌కోట్ నుంచి నిత్యావసర వస్తువులను విమానంలో తరలించారు. పాలు, బ్రెడ్, ఇతర వస్తువులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి జమ్ము కాశ్మీర్‌కు విమానంలో తరలించారు. లోయలో నిత్యావసర వస్తువుల పంపిణీని ప్రక్రియ ప్రారంభమైంది.

కాశ్మీర్‌లో దోవల్

కాశ్మీర్‌లో దోవల్

జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని హైసెక్యూరిటీ జోన్‌తో సహా పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కూడిన అఖండ భారత్‌ను భారత్‌లో ముద్రించారు. బెలూచిస్తాన్‌పై పాక్‌కు హెచ్చరికలు జారీ చేశారు. నేడు జమ్ము కాశ్మీర్.. రేపు బెలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా భారత్ వశం చేసుకుంటుందని, మోడీ ఈ కలను సాకారం చేస్తారని బ్యానర్లలో ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. బ్యానర్లు తొలగించారు. మరోవైపు, అజిత్ దోవల్ జమ్ము కాశ్మీర్‌లో పర్యటించారు. స్థానికులతో ముచ్చటించి, కలిసి నడి రోడ్డుపై భోజనం చేశారు.

English summary

భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్, వాణిజ్యం బంద్ | Pakistan expels Indian envoy, suspends all bilateral trade

Hostilities between India and Pakistan further rose on Wednesday as the neighbour closed a corridor of its airspace, expelled Indian High Commissioner Ajay Bisaria and suspended bilateral trade a day after New Delhi stripped Jammu and Kashmir of special status and bifurcated the state into two Union Territories.
Story first published: Thursday, August 8, 2019, 9:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X