For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, రూ.5000 వేతనం పెంపు, ప్రమోషన్

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! వీరి వేతనం పెరగనుంది. అది కూడా కొన్ని విభాగాలకు చెందిన వారికి మాత్రమే. నెలకు రూ.5వేల పెంపుతో పాటు పదోన్నతులు లభిస్తాయి. వేతన పెంపుతో పాటు ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్ కూడా అందనున్నాయి.

<strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి</strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి

రూ.5,000 పెరిగిన వేతనం

రూ.5,000 పెరిగిన వేతనం

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఇంటి అద్దె అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్‌కు కూడా ఓకే చెప్పింది. KVS పర్సనల్ డిపార్టుమెంట్ కూడా ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఉద్యోగుల గ్రేడ్ పే స్కేల్‌ను రూ.4,200 నుంచి రూ.4,600కు పెరిగింది. లెవల్ 6 నుంచి లెవల్ 7కు ప్రమోషన్ లభించింది. దీంతో నెలవారీ జీతం రూ.5,000కు పెరుగుతుంది.

లెవల్ 7, లెవల్ 6 ఆఫీసర్ల వేతనం ఇలా...

లెవల్ 7, లెవల్ 6 ఆఫీసర్ల వేతనం ఇలా...

సెవెంత్ పే కమిషన్ పే మాట్రిక్స్ ప్రకారం లెవల్ 7 ఆఫీసర్ల కనీస వేతనం రూ.44,900. ఈ కొత్త పే హైక్ ప్రకారం డీఏలో అదనంగా 12 శాతం రానుంది. హెచ్ఆర్ఏ రూపంలో రూ.10,776 వస్తాయి. లెవల్ 6 ఆఫీసర్లకు కనీస వేతనం రూ.35,400 ఉండాలి. డీఏ రూపంలో 12 శాతం, హెచ్ఆర్ఏ రూపంలో రూ.8,496వస్తుంది.

ప్రభుత్వ నిర్ణయంపై...

ప్రభుత్వ నిర్ణయంపై...

ఆల్ ఇండియా ఆడిట్ అంట్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ హరీష్ శంకర్ తివారీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు. KVSలో పని చేసే అసిస్టెంట్ ఎడిటర్ల బేసిక్ వేతనంతో పాటు హెచ్ఆర్ఏ, డీఏ పెరుగుతాయన్నారు.

English summary

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, రూ.5000 వేతనం పెంపు, ప్రమోషన్ | Govt Employees Will Now Receive Monthly Increment of Rs 5000 & Promotion

The new pay hike states that employees of Kendriya Vidyalaya Sangathan (KVS) will receive a monthly hike of Rs 5,000.
Story first published: Thursday, August 8, 2019, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X