జగన్ గుడ్‌న్యూస్, శాలరీ రూ.3,000 నుంచి రూ.10వేలకు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్. వేతన పెంపుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. పెంచిన జీతం ఆగస్ట్ నెల నుంచి అమలులోకి రానుంది.

వేతనం ప్లస్ ఇన్సెంటివ్స్
గత ప్రభుత్వంలో వేతనం, ఇన్సెంటివ్స్ కలిపి రూ.6వేలు వచ్చేవి. ఇన్సెంటివ్ రూ.5,600 వరకు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం రూ.3వేలు మాత్రమే ఇన్సెంటివ్‌గా చెల్లించేలా సీలింగ్ విధించారని, దీంతో వేతనం మూడువేలు, ఇన్సెంటివ్స్ రూ.3వేలు కలిపి రూ.6వేలను ఆశా వర్కర్లు అందుకునేవారని చెబుతున్నారు.

ఇన్సెంటివ్స్ ఇస్తే...
అయితే తెలుగుదేశం ప్రభుత్వం రూ.3 వేల వేతనంతో పాటు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇచ్చేది. దీంతో ఆశా వర్కర్లు నెలకు రూ.8,600 అందుకునే వారు. ఇప్పుడు ప్రభుత్వం వేతనాన్ని రూ.10వేలకు పెంచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినట్లు ఇన్సెంటివ్స్ ఇస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇన్సెంటివ్స్ ఇస్తే వారి వేతనం రూ.15,600కు చేరుకుంటుంది. ఇన్సెంటివ్స్ లేకుండా కేవలం శాలరీ మాత్రమే ఇస్తే గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే కేవలం రూ.1400 మాత్రమే పెంచినట్లు అవుతుంది.

రూ.3వేల నుంచి రూ.10వేలకు
జగన్ పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వేతనాలు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఆశా వర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 43 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications