పాన్ కార్డుతో ఉపయోగాలెన్నో... మీకు తెలుసా..

ఈ రోజుల్లో శాశ్వత ఖాతా నెంబర్ (పాన్) చాలా సందర్భాల్లో తప్పనిసరిగా మారుతోంది. పలు రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమయంలో పాన్ నెంబర్ తెలియజేయాలన్న నిబంధనలు అమల్లో ఉన్నాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, కో-ఆపరేటివ్ సొసైటీ, ప్రభుత్వ ఏజెన్సీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్ షిప్, ట్రస్ట్ లతో పాటు పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే వారు, ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వారందరికీ పాన్ కార్డు అవసరం ఉంటుంది.

పాన్ ఎక్కడ అవసరమంటే..

* ద్విచక్ర వాహనాలు మినహా కార్లు ఇతర పెద్ద వాహనాల క్రయవిక్రయాల సమయంలో...

* బ్యాంకు ఖాతాలో రూ.50,000 కు మించి డిపాజిట్ చేయాలన్నా..

* బ్యాంకులు, పోస్టాఫీసు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తము రూ. 50,000 దాటినా..

* క్రెడిట్ కార్డు దరఖాస్తు కోసం ..

* డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు..

* హోటళ్లలో రూ.50,000 కు మించిన బిల్లు నగదు రూపంలో షిల్లించాల్సి వచ్చినప్పుడు

* విదేశీ కరెన్సీ కొనుగోలు చేసే సమయాల్లో..

* మ్యూచువల్ ఫండ్ కంపెనీకి యూనిట్ల కొనుగోలు కోసం రూ . 50 వేలకు మించి చెల్లించినప్పుడు

* ఒక ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా ప్రీమియం కోసం రూ. 50 వేలకు పైగా చెల్లించినప్పుడు...

* 'సెక్యూరిటీల క్రయవిక్రయాల కోసం ఒక్కో లావాదేవీల్లో రూ . లక్ష దాటితే..

* స్టాక్ మార్కెట్లో నమోదు కానీ కంపెనీలో వాటాలను కొనుగోలు చేసినా, విక్రయించినా..

* స్థిరాస్తుల క్రయవిక్రయాల విలువ రూ. 10 లక్షలు దాటినప్పుడు..

* ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు..

* పాన్ నెంబర్ లేని వారు పైన పేర్కొన్న లావాదేవీలు నిర్వహించే సమయంలో ఫారమ్ నెంబర్ 60ని వినియోగించుకోవచ్చు.

Know about uses of PAN Card

పాన్ అనుసంధానం

* 10 డిజిట్ నెంబర్ కలిగిన పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖా జారీ చేస్తుంది.

* యూటీఐ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎం ఎస్ డీ ఎల్ ) లకు పాన్ కార్డు దరఖాస్తును సమర్పించి పాన్ కార్డును పొందవచ్చు.

* దేశంలో నివాసం ఉండేవారు ఫారం 49 ఏ ను పాన్ కార్డు కోసం సమర్పించాల్సి ఉంటుంది.

* ఆదాయపన్ను రిటర్న్ లు సమర్పించే వారు పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+