భారీ నష్టాల నుంచి కాస్త తేరుకొని..: మార్కెట్లపై కాశ్మీర్ ఎఫెక్ట్!
ముంబై: భారత మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 370, 35ఏ అధికరణలను రద్దు చేసింది. దీనికి అంతర్జాతీయ పరిణామాలు తోడయ్యాయి. ఇవి మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే ప్రారంభంలో తీవ్రంగా నష్టపోయిన మార్కెట్లు ఆ తర్వాత కోలుకొని, కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి.

సెన్సెక్స్, నిఫ్టీ..
సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 36,699.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10,562 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 600, 700 పాయింట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 400 పాయింట్లకు పైగా నష్టంతో క్లోజ్ అయింది. మరోవైపు, బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసేసుకున్నారు. కాశ్మీర్ వ్యవహారం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

కాశ్మీర్ విభజన
జమ్ము కాశ్మీర్ విభజన విషయంలో ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన రావడంతో 418 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.49గా ఉంది.

లాభపడిన, నష్టపోయిన షేర్లు
సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్, TCS, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, HDFC, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, గెయిల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కొటక్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా.. మొదలైన షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇదిలా ఇండగా, జమ్ము కాశ్మీర్‌ను స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ 370, 35ఏను రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ డాలర్ బాండ్స్ పడిపోయాయి.


Click it and Unblock the Notifications