ఇజ్రాయెల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఇజ్రాయెల్ పర్యటనలో ఆదివారం నాడు హడేరాలోని హెచ్2ఐడీ డిశాలినేష్ ప్లాంటును సందర్శించారు. ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ ఇది. ఆయన వెంట్ టెల్ అవీక్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు.

ప్లాంట్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్
హడేరా చేరుకున్న జగన్‌కు సముద్రపు నీటి నుంచి ఇప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై సంబంధిత ప్లాంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంచినీటిని తయారు చేసే ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చును, ఇతర అంశాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు.

నీరు తాగిన జగన్
ప్లాంట్ అధికారులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. ఈ ప్రాజెక్టుకు అయ్యే మూలధన, నిర్వహణ వ్యయాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన నీటిని జగన్ తాగి, నాణ్యత, రుచి బాగున్నాయని కితాబిచ్చారు. జగన్ ప్లాంట్ అంతా కలియదిరిగి పరిశీలించారు. మంచినీటి ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అధికారులను అభినందించారు.

రెండు ప్లాంట్స్‌గా...
హడేరా ప్రాజెక్టుప్రాజెక్టు రెండు ప్లాంట్స్‌గా ఉంటాయి. ఈస్టర్న్, అండ్ వెస్టర్న్. ఈ రెండు ప్రాజెక్టులు కూడ సమాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేటికవే ఇండిపెండెంట్‌గా ఆపరేట్ అవుతాయి. హడేరా ప్లాంటులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షామీర్ ఈ ప్లాంటు సందర్శనకు ఏర్పాటు చేశారు.

ఇలా చేస్తాం....
ఒకరోజుకు 3.38 లక్షల క్యూబిక్ మీటర్ల మంచి నీటిని ఉత్పత్తి చేసే విధంగా ఈ ప్లాంటును తయారు చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 4.6 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచారు. నీటి కొరతను అధిగమించేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. సముద్రపు నీటిని డిశాలినేట్ చేయడానికి ప్రీ ట్రీట్మెంట్ మొదటి దశ అని ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ జగన్‌కు వివరించారు. ఇది ఉప్పు అవపాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని, దీనికి ప్రజెర్ ఎక్స్‌చేంజ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రీట్రీట్మెంట్ కచ్చితంగా అవసరమని అదికారులు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications