న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకుంది. దీనిని చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండాలని అంచనా. అలాగే, స్థూల జాతీయోత్పత్తిలో పెట్టుబడి రేటును 38 శాతానికి పెంచవలసి ఉంటుంది. వచ్చే అయిదేళ్లలో తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) వెల్లడించింది.

ఈ వృద్ధితో మోడీ టార్గెట్ చేరుకోవడం కష్టమే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడం ప్రస్తుత వృద్ధితో అసాధ్యమని అభిప్రాయపడింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో వచ్చే మార్చి నాటికి 7 శాతం వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

9 శాతం వృద్ధి సాధిస్తే ఇలా పెరుగుదల..
గత ఏడాది ఇది 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా వచ్చే అయిదేళ్ల పాటు తొమ్మిది శాతం వృద్ధిరేటును సాధిస్తే భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 3.3 ట్రిలియన్ డాలర్లకు, ఆ తర్వాత సంవత్సరం 3.6 ట్రిలియన్ డాలర్లకు, 2022-23 నాటికి 4.1 ట్రిలియన్ డాలర్లకు, 2023-24లో 4.5 ట్రిలియన్ డాలర్లకు, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

వృద్ధి శాతంతో పాటు ఇవి కూడా..
ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో రెండు శాతం బలపడినప్పుడే ఈ లక్ష్యానికి చేరుకుంటామని తెలిపింది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని తెలిపింది. ముఖ్యంగా ప్రయివేటు పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications