విద్యుత్ వాహన ధరలు దిగొస్తున్నాయ్..
విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికీ శుభవార్త.. ఇటీవలే విద్యుత్ వాహనాలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. దీని వల్ల విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారిపై భారం మరింత తగ్గనుంది. ఫలితంగా వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
గుడ్‌న్యూస్: రూ.80,000 తగ్గిన టిగోర్ ఎలక్ట్రిక్ కారు ధర'

టాటా టిగోర్
* టాటా మోటార్స్ తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ టిగోర్ ధరను రూ. 80,000 వరకు తగ్గించింది.
* ఇప్పటిదాకా ఈ మోడల్ ధర ఫేమ్ 2 సబ్సిడీ లేకుండా రూ.12.35- 12.71 లక్షలుగా ఉండేది. తాజా తగ్గింపుతో ధర రూ. 11.58-11.92 లక్షలకు తగ్గింది. ఫేమ్ సబ్సిడీ ఉన్నప్పుడు పాత ధర రూ. 10.99-11.09 లక్షలు ఉండగా కొత్త ధర రూ. 9.96-10.30 లక్ష్యాలకు చేరుకుంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్ ముంబై కి చెందినవి.
* ఎలక్ట్రిక్ టిగోర్లో కంపెనీ మూడు వేరియంట్లను అందిస్తోంది.

మహీంద్రా ఈ-వెరిటో
* మహీంద్రా అండ్ మహీంద్రా తన ఈ-వెరిటో ధరను రూ. 80,000 తగ్గించింది. దీంతో దీని ధర రూ. 10.71 లక్షలకు (ఫేమ్ ప్రయోజనాలు, ఆన్ రోడ్, ఢిల్లీ ) చేరుకుంది.
* త్రీవీలర్ ట్రియో ధర రూ. 20,000 వరకు తగ్గించింది. దీని ధర రూ. 2.05 లక్షల నుంచి ప్రారంభం (ఆన్ రోడ్ ) అవుతుంది.

హ్యుండై కోనా ఎలక్ట్రిక్
* హ్యుండై మోటార్ ఇండియా తన కోనా ఈవీ ధరను దాదాపు రూ.1.58 లక్షలు తగ్గించింది.
* దీంతో ఈ మోడల్ ధర రూ.25. లక్షల నుంచి రూ.23. 71 లక్షలకు తగ్గింది.
* తగ్గించిన ధరలు ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కోనా మోడల్ కు 152 బుకింగ్స్ వచ్చినట్టు కంపెనీ చెబుతోంది.

ఎథర్ ఎనర్జీ
* ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఎథర్ ఎనర్జీ కంపెనీ కూడా తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎథర్ 450 ధరను రూ. 9,000 వరకు తగ్గించింది.
* ప్రస్తుతం ఈ స్కూటర్లు బెంగళూర్, చెన్నై లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో ఈ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

గత ఏడాది అమ్మకాలు..
* దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2018 - 19) లో దేశవ్యాప్తంగా 1. 26 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో అధిక వాటా టూవీలర్లదే.
* ఇప్పటి దాక టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు మాత్రమే కార్లను విక్రయిస్తున్నాయి. ఇటీవలే హ్యుండై తన కోనా ఎస్ యువీని విడుదల చేసింది. రానున్న మరికొన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తెచ్చే పనిలో ఉన్నాయి.
* ప్రభుత్వం ఈ వాహనాలపై భారాన్ని తగ్గించి ప్రోత్సహకాలు కల్పిస్తే వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications