న్యూఢిల్లీ: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (FPI) నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు FPIలను కొంత వెనక్కి తీసుకున్నారు. కేంద్రంలో స్థిరప్రభుత్వం రాకపోవచ్చుననే ఎగ్జిట్ పోల్ అంచనాల భయంతో వెనక్కి తీసుకున్నారు. అయితే, గత కొన్ని నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే జూలై నెలలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

రూ.3,758 కోట్లను వెనక్కి తీసుకున్నారు
విదేశీ ఇన్వెస్టర్లు జూలై నెలలో రూ.3,758 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూలై 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం స్టాక్ మార్కెట్లు ఎక్కువ రోజులు నష్టాల్లో కొనసాగాయి. అదే సమయంలో సూపర్ రిచ్ (అధిక సంపన్నులు) పైన సర్ ఛార్జీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళపై పడ్డాయి.

మొత్తంగా రూ.రూ.14,382 కోట్లు
జులై 1 నుంచి 26వ తేదీ మధ్య FPIలు నికరంగా రూ.14,382.59 కోట్ల విలువైన ఈక్విటీలని వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ.10,624.15 కోట్లు డెట్ సెగ్మెంట్లో పెట్టుబడి కాగా, నికరంగా రూ.3,758.44 కోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో సూపర్ రిచ్ పైన సర్‌ఛార్జీ వసూలు చేస్తామన్న ప్రకటన వచ్చిన నాటి నుంచి FPIల అమ్మకాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు.

అంతకుముందు ఇలా ఇన్వెస్ట్‌మెంట్
అంతకుముందు, జూన్ నెలలో రూ.10,384.54 కోట్లు, మే నెలలో రూ.9,031.15 కోట్లు, ఏప్రిల్‌లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను ఇండియన్ మార్కెట్లలోని ఈక్విటీ, డెట్‌లలో ఇన్వెస్ట్ చేశారు. సూపర్ రిచ్ ట్యాక్స్ ప్రకటన వచ్చినప్పటి నుంచి FPI అమ్మకాలు పెరిగాయని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజిస్ట్ వికే విజయ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications