హైదరాబాద్: రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. ఖనిజ, గనులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ తదితర శాఖల డైరెక్టర్లు ఈ ప్రత్యేక విభాగంలో సభ్యులుగా ఉంటారని, ఎగుమతిదారులు ఎలాంటి సమస్య అయినా వారి దృష్టికి తీసుకు వెళ్లవచ్చునని చెప్పారు. భారతీయ ఎగుమతుల సంఘాల సమాఖ్య (FIEO) నిర్వహించిన తెలంగాణలో ఎగుమతులు - సమస్యలు అంశంపై ఆయన మాట్లాడారు.

పది రాష్ట్రాల జాబితాలో నిలిచింది
ఎగుమతుల రంగంలో తెలంగాణ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందని జయేష్ రంజన్ అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1.56 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల జాబితాలో నిలిచిందని చెప్పారు. మరింత వృద్ధి సాధించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కేంద్రం రాయితీలన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు.

వీటికి మంచి డిమాండ్
పారిశ్రామిక పురోగమనానికి ఎగుమతులు కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఎగుమతుల వృద్ధిలో ఐటీ రంగం అగ్రస్థానంలో ఉందని, గత ఏడాది రూ.1.05లక్షల కోట్ల మేర ఎగుమతులు ఉన్నాయన్నారు. ఇతర ఉత్పత్తుల సేల్స్ రూ.51వేల కోట్ల మేర ఉన్నాయన్నారు. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలకు ఎగుమతులు లాభదాయకంగా ఉన్నాయని, ఐటీ, ఔషధ, వైమానిక, ఇంజినీరింగ్, గ్రానైట్, చేనేత, జౌళి, హస్తకళలు వంటి వాటికి మంచి డిమాండ్ ఉందన్నారు.

7.38 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతి
దేశంలో ఎగుమతులు చేస్తున్న రాష్ట్రాల్లో టాప్ 5 స్థానానికి చేరాలన్నది తెలంగాణ లక్ష్యమన్నారు. తెలంగాణలో మరో అయిదేళ్లలో ఎగుమతులు రెట్టింపు అవుతాయన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 7.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి నమోదు అయిందన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications