అమరావతి: ఉత్తరాంధ్రలోని ట్రైబల్స్ పండించిన ఆర్గానిక్ కాటన్‌తో తయారైన టీ షర్ట్స్‌కు బెల్జియంలో యమ గిరాకీ పెరిగింది. అక్కడి మ్యూజిక్ లవర్స్ వీటిని ఎంతో ఇష్టపడతారు. తిరుపూర్, కోయంబత్తూరుల్లోని గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లో ఈ ఆర్గానిక్ కాటన్‌తో తయారైన 30,000 టీషర్టులను బెల్జియంలోని ఓ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివెల్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ పత్రిక ది హిందూలో ఓ కథనం వచ్చింది.

ఆర్గానిక్ దుస్తులకు పెరుగుతున్న డిమాండ్
ఆర్గానిక్ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు ఉత్తరాంధ్రలో తయారైన ఈ టీ షర్ట్స్‌కు బెల్జియంలో ఇప్పుడు డిమాండ్ పెరగడమే నిదర్శనం. బెల్జియంలో జూలై 19వ తేదీ నుంచి 29 తేదీ వరకు టుమారోల్యాండ్ ఆధ్వర్యంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివెల్‌ను (EDM) నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న 8,000 మంది పార్టిసిపెంట్స్ ఈ వేలాది టీ షర్ట్స్ ఉపయోగిస్తున్నారు.

టుమారోల్యాండ్ 15వ యానివర్సరీ
టుమారోల్యాండ్ తన 15వ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటోంది. తమ సభ్యులకు ఇలాంటి టీ షర్ట్స్‌ను పంపిణీ చేయడం ద్వారా పునరుత్పాదక ఉత్పత్తులపై బలమైన సందేశాన్ని పంపించాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా రీజనరేట్ ది ఎన్విరాన్‌మెంట్ సొసైటీ అండ్ ఎకానమీ త్రూ టెక్స్‌టైల్స్ (RESET) అనే ఎన్జీవో అర్బన్ ఫైబర్స్, బెల్జియంతో జతకట్టింది.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రామాల నుంచి ఉత్పత్తులు
ఈ మేరకు విజయనగరం జిల్లాలోని పాచిపెంట, కురుపామ్, గుమ్మలక్ష్మిపురం, శ్రీకాకుళం జిల్లాలోని బ్రాహ్మిణి తదితర 26 గ్రామాల నుంచి కాటన్‌ను సేకరించారు. 250 ఎకరాల్లో 230 మంది రైతులు పండించిన 18 టన్నుల ఆర్గానిక్ కాటన్‌ను సేకరించారు. దిగుబడి మరింతగా ఉండాలి. కానీ గత ఏడాది వచ్చిన టిట్లీ తుఫాను కారణంగా పంట నష్టం జరిగింది. వాతావరణ స్థితిస్థాపక పద్ధతులు, కార్బన్ ఫార్మింగ్ ద్వారా పునరుత్పత్తి కాటన్‌ను ఉత్పత్తి చేశారు. ఈ ప్రాజెక్టును RESET ద్వారా చేపట్టారు.

ఇది గర్వకారణం
వరల్డ్ లార్జెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు 30,000 సస్టైనబుల్ టీ షర్ట్స్ విక్రయించడం గర్వించదగ్గ విషయమని, విజయనగరం, శ్రీకాకులం జిల్లాలోని ఈ కాటన్ ఉత్పత్తిదారులకు 30 శాతం అదనపు ఆదాయం భరోసా లభించిందని ఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ శరత్ గిడ్డ అన్నారు. కెమికల్ పెస్టిసైడ్స్, కలుపు సంహారాలు, సింథటిక్ ఫర్టిలైజర్స్ ఉపయోగించకుండా రైతులను ఒప్పించామన్నారు. ఆ యూనీసెక్స్ (unisex) మోడల్ టీ షర్ట్స్ అటు మనుషులకు, మరోవైపు పర్యావరణానికి హాని కలిగించని ఫ్యాబ్రిక్, ప్రింట్ రంగులతో తయారుచేయబడ్డాయన్నారు.

మరింతమంది రైతులను జత చేస్తాం...
రాబోవు ఐదేళ్ళలో 62,500 ఎకరాల పునరుత్పత్తి విస్తీర్ణంతో 15,000 మంది రైతులను జత చేస్తామని చెప్పారు. కాగా, ఈ ఎన్జీవో సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అర్గానిక్ కాటన్ సాగును చేపట్టాలని భావిస్తోంది. రీజెనెరేటివ్ కాటన్ వ్యాల్యూ చైన్ సృష్టించడం తమ లక్ష్యమని చెప్పారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications