కొత్త రూట్లలో ఇండిగో బంపరాఫర్, రూ.1,999కే టిక్కెట్లు
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఇండిగో 5 సెప్టెంబర్ 2019 నుంచి జోద్‌పూర్ - ఢిల్లీ మధ్య, జోద్‌పూర్ - అహ్మదాబాద్ మధ్య ప్రతి రోజు నాన్-స్టాప్ విమానాలు నడపనుంది. ఇండిగోకు జోద్‌పూర్ 59వ డొమెస్టిక్ డెస్టినేషన్. ఈ నేపథ్యంలో ఈ విమానయాన సంస్థ రూ.1,999తో మంచి ఆఫర్లు ప్రకటించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఆఫర్ విమాన ప్రయాణీకులకు తీపికబురే.
ఈ రూట్లలో విమాన ఛార్జీలను రూ.1,999గా నిర్ణయించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తాలా, ఢిల్లీ -దిబ్రూగఢ్ రూట్లలోనూ డైరెక్ట్ ఫ్లైట్ సేవల్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెట్టనుంది.

అగర్తాలా, దిబ్రూగఢ్ రూట్లలో విమాన ఛార్జీలను వరుసగా 3,999, 4,999గా నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ, ముంబైలని కలుపుతూ ఆరు కొత్త అంతర్జాతీయ విమానాలకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబై-దిబ్రూగఢ్ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయి.
ఈ మేరకు ఇండిగో ట్వీట్ చేస్తూ... జోద్‌పూర్ 59వ డొమెస్టిక్ డెస్టినేషన్ అని, ఢిల్లీ, అహ్మదాబాద్‌ల నుంచి నాన్ స్టాప్ డెయిలీ సర్వీసులు ప్రవేశపెడుతున్నామని, కొత్త అనుభూతిని పొందండి అని ట్విట్టర్‌లో పేర్కొంది. ఇప్పుడే బుక్ చేయండి అంటూ పేర్కొంది.
కాగా, ఇండిగో జూలై 20వ తేదీ నుంచి కోల్‌కతా - షిల్లాంగ్ మధ్య కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. ఇండిగో జూన్ చివరినాటికి 235 విమానాలను కలిగి ఉంది. ఇది 70కి పైగా గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది.
ఇండిగో ఆగస్ట్ 22 నుండి ముంబై-సింగపూర్ మార్గంలో, ముంబై-బ్యాంకాక్ మార్గంలో రోజువారీ నాన్ స్టాప్ విమానాలను ప్రారంభిస్తుంది.
ఇండిగో ఢిల్లీ ముంబైలను కలిపే ఆరు కొత్త అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించనుంది. కొత్త విమానాలు ఢిల్లీ-జెడ్డా, ముంబై-కువైట్, ముంబై-దుబాయ్ మార్గాల్లో ఉంటాయని ఇండిగో తెలిపింది.


Click it and Unblock the Notifications