న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్, ఈ-కామర్స్ సంస్థల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయా? అంటే ఈ రెండు సెక్టార్‌లలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గిపోతోందని ఓ సర్వేలో వెల్లడైందట. ఈ మేరకు టీమ్ లీజ్ సర్వీసెస్ సర్వేలో వెల్లడైందట. కీలక జాబ్ క్రియేటింగ్ సెక్టార్లలో ఫ్రెష్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయట. దీనికి ఆటోమేషన్ కారణం. ఈ-కామర్స్, BFSI (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్), BPO-IT రంగాల్లో 2019-23 మధ్య ఉద్యోగ సృష్టి 37 శాతం వరకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2018-22 అంచనా కంటే ఎక్కువ.

ఉద్యోగాలు మందగించిన రంగాలు...
ఉద్యోగ కల్పన మందగించిన రంగాలలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కూడా ఉన్నాయి. వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, టెలీ కమ్యూనికేషన్స్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, వినోదం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యుటికల్స్ కూడా ఉన్నాయి. టీమ్ లీజ్ సర్వీసెస్ ఈ మేరకు ఉద్యోగాలు అండ్ శాలరీ ప్రీమియర్ 2019, ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ రిపోర్ట్, హెచ్‌వై1, 2019-20.. రెండు నివేదికల్లో ఈ అంశాలు పేర్కొంది. ఇందులో పర్మినెంట్, టెంపరరీ ఉద్యోగాల అంశాలు ఉన్నాయి.

ఏఐ, రోబోటిక్స్ బేస్ట్ ఆటోమేషన్...
AI/రోబోటిక్స్ బేస్డ్ ఆటోమేషన్ కారణంగా రాబోయే ప్రభావాలను ఎదుర్కోవటానికి యాజమాన్యం, పాలసీ మేరక్స్ చురుకైన చర్యలు తీసుకోకపోతే చాలా రంగాలకు దీర్ఘకాలిక ఉద్యోగ కల్పన తగ్గుతుందని తాము లెక్కించిన నాలుగు సంవత్సరాల ఉద్యోగ కల్పన అంచనాల ద్వారా వెల్లడైందని టీమ్ లీజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రబర్తి తెలిపారు.

కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటే..
షార్ట్ టర్మ్‌లో, ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో నెట్ ఉపాధి కల్పనలో గణనీయమైన పెరుగుదల ఉందని, ఈ ఆరు నెలల్లో నియామకాలు పెంచినట్లుగా 95% మంది యజమానుల సర్వే ద్వారా వెల్లడైందని చెప్పారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే వారికి యాజమాన్యాలు ప్రత్యేక రివార్డులు ఇస్తున్నాయన్నారు. అప్ డేట్ కాని వారి వేతనాల్లో పెరుగుదల లేదన్నారు.


Click it and Unblock the Notifications