హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది. సిరిసిల్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ 17 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్తోందన్నారు. ఆసరా పెన్షన్ పెంపుతో పాటు పెన్షన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. వయస్సు జూలై నుంచి అమలవుతోంది. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ అందుతున్నాయి. బీడీ కార్మికుల కటాఫ్ తేదీని 2019కి చేశారు. దీంతో సుమారు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ వస్తున్నాయి.

బ్యాంకులు, పోస్టాఫీస్, నగదు ద్వారా పెన్షన్ చెల్లింపు
ప్రతి నెల పెన్షన్ కోసం రూ.12వేల కోట్లు అవసరం. ఇందులో రూ.200 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి. ఈ రోజు (జూలై 21) నుంచి పెన్షన్ దారులకు ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి రెట్టింపు పెన్షన్ అందుతోంది. దివ్యాంగులకు రూ.3,016, మిగిలిన లబ్ధిదారులకు రూ.2,016 పెన్షన్ అందనుంది. ప్రతి నెల పెన్షన్ చెల్లింపుకు రూ.863,24,07,084 అవసరం. ఇందులో బ్యాంకుల నుంచి నేరుగా ఖాతాల్లోకి రూ.371 కోట్లు వెళ్తాయి. మిగతా మొత్తం పోస్టాఫీసులు లేదా నగదు చెల్లింపు ద్వారా ఇస్తారు.

లబ్ధిదారులు ఇలా...
మొత్తం రూ.38,99,044 లబ్ధిదారుల్లో దివ్యాంగులు రూ.4,89,250 ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016 పెంచారు. తెలంగాణలో 38,99,044 మంది పెన్షన్ దారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు 12,92,594, వితంతువులు 14,35,090, వికలాంగులు 4,89,250, గీత కార్మికులు 62,394, చేనేత కార్మికులు 37,074, బీడీ కార్మికులు 4,08,381, ఒంటరి మహిళలు 1,31,736, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 28,394, బోదకాల బాధితులు 14,131 మంది ఉన్నారు.

లబ్ధిదారులకు ప్రయోజనం
ఇళ్ల కేటాయింపులో దళారులను ఆశ్రయించవద్దని, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హులను, బహిరంగ లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇళ్లులేని నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇచ్చే ప్రణాళకలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తామన్నారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాల అమలు కారణంగా ఇప్పుడు సర్కార్ ఆసుపత్రుల్లో 40 శాతం ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. పొదుపు సంఘాలకు రూ.65 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications