ముంబై: భారతీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వేతనం పదకొండో ఏడాది కూడా 15 కోట్లుగానే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) చైర్మన్ హోదాలో ఆయన 2008-09 నుంచి జీతభత్యాలు, కమిషన్ అన్నీ కలిపి రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 11వ ఏడాది అంతే తీసుకున్నారు. ఆయన ఏడాదికి రూ.24 కోట్ల ఆదాయం వదులుకుంటున్నారు. 2019 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయానికి కజిన్స్ నిఖిల్, హితాల్ మేస్వానీ సహా కంపెనీ డైరెక్టర్లు అందరి రెమ్యునరేషన్ భారీగా పెరిగింది.
చదవండి: 6.8 శాతం పెరిగిన రిలయన్స్ లాభం, షేర్ ఆదాయం రూ.17.1

పదకొండేళ్లుగా రూ.15 కోట్లు
'చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ వేతనం, ఇతరాలు కలిపి రూ.15 కోట్లుగా నిర్ణయించబడింది. యాజమాన్య వేతనస్థాయిలు పరిమితంగా ఉండాలని చెప్పేందుకు తాను ఓ ఉదాహరణగా నిలవాలని ఆయన అభిమతానికి ఈ నిర్ణయమే నిదర్శనం' అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ముఖేష్ వేతనం.. అలవెన్సులు ఇలా...
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ముఖేష్ అంబానీ వేతనం, అలవెన్స్‌లు రూ.4.45 కోట్లుగా ఉంది. గత ఏడాది (2017-18) ఆర్థిక సంవత్సరంలో రూ.4.49 కోట్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అయితే కంపెన్షేషన్ మాత్రం రూ.9.53. ఇందులో ఎలాంటి మార్పు లేదు. బత్తా గత ఏడాది రూ.27 లక్షల నుంచి ఇప్పుడు రూ.31 లక్షలకు పెరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.71 లక్షలు.

ఇతర డైరెక్టర్ల వేతనం కంటే తక్కువ
గతంలో కంపెనీల సీఈవోల వేతనాల విషయంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ తనకు తాను స్వచ్చంధంగా 2009 నుంచి రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఇతరుల వేతనాలు మాత్రం పెరుగుతున్నాయి. కానీ ముఖేష్ మాత్రం పదేళ్లుగా అంతే మొత్తం తీసుకుంటున్నారు. అంబానీ కజిన్స్ నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ ఆర్ మేస్వానీలు ఒక్కొక్కరు రూ.20.57 కోట్లు తీసుకుంటున్నారు.

కజిన్స్ వేతనం ఇలా...
నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ ఆర్ మేస్వానీ 2017-18లో రూ.19.99 కోట్లు, 2016-17లో రూ.16.58 కోట్లు తీసుకున్నారు. 2015-16లో నిఖిల్ రూ.14.42 కోట్లు, హితాల్ రూ.14.41 కోట్లు తీసుకున్నారు. 2014-15లో ఇద్దరూ కూడా రూ.12.03 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ గత అంతకుముందు ఏడాది రూ.8.99 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, 2019లో రూ.10.01 కోట్లు తీసుకున్నారు. 2014-15లో రూ.6.03 కోట్లు, 2016-17లో రూ.7.87 కోట్లు తీసుకున్నారు.

నీతా అంబానీ ఫీజు రూ.1.65 కోట్లు
రిఫైనరీ చీఫ్ పవన్ కుమార్ కపిల్ కంపెన్షేషన్ 2017-18లో రూ.3.47 కోట్లు తీసుకోగా, ఇప్పుడు రూ.4.17 కోట్లు తీసుకున్నారు. 2015-16లో ఇతని రెమ్యునరేషన్ రూ.2.94 కోట్లు ఉండగా, రూ.2.54 కోట్లకు తగ్గింది. 2014-15లో ఇతను రూ.2.41 కోట్లు తీసుకున్నాడు. నీతా అంబానీ వంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రూ.1.65 కోట్ల వరకు తీసుకున్నారు. సిట్టింగ్ ఫీజు కాకుండా ఇది అదనం. 2017-18లో కమిషన్ రూ.1.5 కోట్లు కాగా, 2018-19లో రూ.1.3 కోట్లు మాత్రమే తీసుకున్నారు. నీతా అంబానీ సిట్టింగ్ ఫీజుగా గత ఏడాది రూ.6 లక్షలు తీసుకోగా, ఇప్పుడు రూ.7 లక్షలు తీసుకున్నారు. నీతా అంబానీ షిర్డీ దేవాలయానికి భద్రతా పరికరాలను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ రూ.1.17 కోట్లు. రిలయన్స్‌లో బోర్డులో ఉన్న అరుందతి భట్టాచార్య 2017-18లో రూ.75 లక్షలు తీసుకున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications