బెంగళూరుకు చెందిన మోస్ట్ వ్యాల్యూడ్ ఎడ్-టెక్ స్టార్టప్ బైజూస్ వ్యాల్యుయేషన్ ఇప్పుడు ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సిరీస్ ఎఫ్ ఫండింగ్ రౌండ్‌లో ఇది చరిత్ర సృష్టించింది. సీరీస్ F ఫండింగ్ రౌండ్‌లో బైజూస్ వ్యాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు పెరిగి, 5.52 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం సింగిల్ రౌండ్‌లోనే అనూహ్యంగా పెరగడం అరుదైన విషయం.

బైజూస్ F సిరీస్ ఫండింగ్
బైజూస్ F సిరీస్ ఫండింగ్ రౌండ్‌లో రూ.3,159.4 కోట్ల (460.8 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. సౌతాఫ్రికాకు చెందిన నాస్పర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ జనరల్ అట్లాంటిక్, కెనెడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు వంటి ఇన్వెస్టర్ల ఆధ్వర్యంలో దీనిని సమీకరించింది. ఈ నిధుల సేకరణలో ఈ కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. ఒక్క సింగిల్ రౌండ్‌లోనే బైజూస్ వ్యాల్యూ 53 శాతం పెరగడం గమనార్హం. ఇది గత డిసెంబర్ నుంచి నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది.

ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్ల సేకరణ
సిరీస్ F ఫండింగ్‌ను డిసెంబర్ నుంచి ప్రారంభించింది. అంతకుముందు ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. జూలై మొదటి వారం, నాలుగో రౌండ్‌లో 86 మిలియన్లు (రూ.589 కోట్లు) సేకరించింది. ఆరు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లు సేకరించింది. సింగిల్ రౌండ్‌లో ఇంతటి ఇన్వెస్ట్‌మెంట్స్ అసాధారణమని, బైజూస్ వేగవంతమైన వృద్ధి కారణంగా ఫండ్స్ వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే బైజూస్ వ్యాల్యూయేషన్ పెరుగుతోంది
2019 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బైజూస్ రెవెన్యూ మూడు రెట్లు పెరిగి, రూ.1,430 కోట్లకు చేరుకుంది. ఏడాది మొత్తం లాభదాయకంగా ఉంది. ఇతర స్టార్టప్స్ వలే ఏడాదికి ఏడాది ప్రాతిపదికన కాకుండా నెలకు నెలకు వ్యాల్యుయేషన్ పెరుగుతోందని బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం పేపర్.వీసీ ఫౌండర్ వివేక్ దురై అన్నారు. ఇండియాలోని యూనికార్న్స్‌లలో బైజూస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. గ్రేడ్స్ I-IIIతో పాటు యూఎస్ మార్కెట్లోకి విస్తరించిన నేపథ్యంలో వ్యాల్యుయేషన్ భారీగా పెరిగిందని చెబుతున్నారు.

అమెరికాలో కొనుగోలు
ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతార్ సావరీన్ వెల్త్ ఫండ్ వంటి కొత్త ఇన్వెస్టర్లు 150 మిలియన్ డాలర్లు (రూ.1,028.61 కోట్లు) సమీకరించినట్లు గత వారం బైజూస్ వెల్లడించింది. ఎడ్-టెక్ ఇన్వెస్టర్ వోల్ వెంచర్స్ కూడా ఈ ఇండియన్ స్టార్టప్ (బైజూస్)లో ఇన్వెస్ట్ చేసింది. గత డిసెంబర్‌లో బైజూస్ 540 మిలియన్ డాలర్లు (రూ.3,865 కోట్లు) సమకూర్చినట్లు ప్రకటించింది. మార్చి 2019 ఎండ్ నాటికి రూ.1,430 కోట్ల రెవెన్యూను ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో బైజూస్ యూఎస్‌కు చెందిన ఓస్మో ( Osmo)ను 120 మిలియన్ల డాలర్లకు (రూ.850 కోట్లు) కొనుగోలు చేసింది.

పిల్లల చదువుకు ఇండియన్ పేరెంట్స్ రెడీ
తమ పిల్లల విద్యపై ఖర్చు చేసేందుకు ఇండియన్ పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారని, ఇది కూడా బైజూస్ ఆదరణకు ముఖ్య కారణమని చెబుతున్నారు. ఇప్పటికే ఇది 35 మిలియన్ల మంది విద్యార్థులకు చేరువైందని, మేథమేటిక్స్, సైన్స్, ఇంగ్లీష్‌ను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతోందన్నారు. K-12 విద్యార్థులు, కొత్త మార్కెట్లోకి విస్తరించడం వల్ల బైజూస్ మార్కెట్ వ్యాల్యూయేషన్ పెరుగుతుందన్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications