భారత్ ఆర్ధిక వ్యవస్థ మందగమనం లోకి వెళుతోందా? ఇటీవలి గణాంకాలు పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు 7-8 నెలలుగా వరుసగా ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోతున్నాయి. మరో వైపు రుణ అభయ కొరవడుతోంది. నాన్ బ్యాంకింగ్ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. బ్యాంకుల పరిస్థితీ గొప్పగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా... జూన్ నెలలో మన దేశ ఎగుమతులు భారీగా పడిపోయాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... జూన్ లో ఎగుమతులు 9.71% తగ్గి $25.01 బిలియన్ డొల్లర్లుగా నమోదయ్యాయి. గత 9 నెలల కాలంలో ఎగుమతులు తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జూన్ నెలలో మన జీడీపీ కూడా 27 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 6.2% నికి పరిమితమైంది.

అన్ని దేశాల ఎగుమతులదీ అదే బాట....
ఎగుమతుల విషయంలో దాదాపు అన్ని దేశాలది ఒకే దారిలా కనిపిస్తోంది. జూన్ మాసంలో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాకు చేసే ఎగుమూతులు 14.1% పడిపోయాయి. అమెరికా తో నెలకొన్న వాణిజ్య యుద్ధ ప్రభావం మన దేశం నుంచి జరిగే ఎగుమతులపై కూడా పడటం ఇక్కడ గమనార్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేసే ఎగుమతులు 15.31% తగ్గిపొగా .. హొంగ్కాంగ్ ఎగుమతులు 9.68% డౌన్ అయ్యాయి. అయితే గతేడాది జూన్ నెలలో మన దేశ ఎగుమతులు అత్యంత మెరుగ్గా ఉండటం వల్ల... ప్రస్తుతం మన ఎగుమతులు తగ్గినట్లు కనిపిస్తోందని... ఇది కేవలం బేస్ ఎఫెక్ట్ మాత్రమేనని కామర్స్ సెక్రటరీ అనూప్ వాధవాన్ వెల్లడించాలంటూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.

ప్రపంచ మందగమన ప్రభావం...
మన ఎగుమతులు తగ్గడానికి కారణం కేవలం భారత్ దేశంలో నెలకొన్న పరిస్థితుల వాళ్ళ కాదని... ప్రపంచవ్యాప్త మందగమనం మన పై కూడా పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన కంటే ఒక శతం తక్కువగా కేవలం 2.6% మాత్రమే పెరగటం దీనినే సూచిస్తోందని వారు వాదిస్తున్నారు. ప్రపంచాన్ని మొత్తం తన ఎగుమతులతో ముంచెత్తే చైనా దేశ ఎగుమతులు సైతం జూన్ లో 1. 3% తగ్గగా.. ఆ దేశం చేసుకొనే దిగుమతులు 7. 3% తగ్గిపోయాయని వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మందగమనం అలుముకొందని, పెరుగుతున్న టారిఫ్ యుద్ధానికి ఇదే సంకేతమని ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజషన్స్ ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ పేర్కొన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

తగ్గినా వాణిజ్య లోటు...
భారత దేశ ఎగుమతులు తగ్గినప్పటికీ... మన దేశ వాణిజ్య లోటు కూడా తగ్గడం ఒకింత ఊరటగా కనిపిస్తోంది. జూన్ నెలలో వినిజ్య లోటు 7.8% తగ్గి 15.28 డాలర్లకు పరిమితమైంది. అంతకు మూడు ఏడాది ఇదే నెలలో మన వాణిజ్య లోటు 16.6 బిలియన్ డాలర్లు గా ఉంది. మన దిగుమతులు సైతం జూన్ నెలలో 9.1% తగ్గి 40.29 బిలియన్ డాలర్ల కు పరిమితం అవడంతో వాణిజ్య లోటు కూడా తగ్గింది. మన దేశం నుంచి జరిగే ప్రధాన ఎగుమతులు ఐన పెట్రోలియం ఉత్పత్తులు, ధాన్యం, కాటన్, జేమ్స్ అండ్ జ్యువలరీ, రెడీమేడ్ గార్మెంట్స్, ఆర్గానిక్ & ఇనార్గానిక్ కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications