ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వినియోగాదారులకు బంపరాఫర్స్ ప్రకటించాయి. ప్రైమ్ డే సేల్ పేరుతో అమెజాన్, బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 15, 16 తేదీల్లో ఉండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 15 నుంచి 18 మధ్య ఉంది. స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం ప్రత్యేక సేల్‌ను ఈ రోజు నుంచి ప్రారంభించింది. దీనికి తోడు SBI కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. రియల్ మి, నోకియా స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్స్, కంప్యూటర్ల్, టీవీ వంటివి తగ్గింపు ధరల్లో రానున్నాయి. షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ (3GB, 32GB) ఫోన్ రూ.10,999గా ఉంది. ఆఫర్‌లో దీనిని రూ.9,999కి ఇస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 3 (64GB) MRPS రూ.71,000. ఆఫర్లో ఇది రూ.49,999కు రానుంది. పిక్సెల్ 3ని కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌కు గూగుల్ హోమ్ మినీని పొందవచ్చు. హానర్, రియల్ మి, మోటరోలా, వివో ఫోన్లు కూడా మంచి ఆఫర్‌కు లభిస్తున్నాయి.

భారీ ఆఫర్లు
రూ.40,900 విలువ కలిగిన 40mm వేరియంట్ ఆపిల్ వాచ్ సిరీస్ 4 ఆఫర్లో రూ.34,900కు వస్తోంది. రూ.4,999 విలువ కలిగిన గూగుల్ హోమ్ మినీ రూ.2,499కు వస్తోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, గృహ ఉత్పత్తులు, ఫర్నీచర్ పైన 40-80 శాతం వరకు, పుస్తకాలు, బొమ్మలు, క్రికెట్ బ్యాగ్స్ వంటి వాటిపై 80 శాతం వరకు, వాషింగ్ మెషీన్లు, టీవీ, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు, దుస్తులు, బూట్లపై 40 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఉంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్
మరోవైపు, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. రూ.59,999 విలువ కలిగిన ఐపోన్ ఎక్స్ఆర్‌ను రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్‌పై రూ.7వేల వరకు తగ్గింపు ధర ఉంది. హువావే, హానర్, వన్ ప్లస్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. హానర్, వన్ ప్లస్, హువావే ఫోన్లపై రూ.10వేల నుంచి రూ.13వేల వరకు కూడా తగ్గింపు ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications