ఆదాయపు పన్ను శాఖ ఇక మరింతగా తన పరిధిని పెంచబోతోంది. లావాదేవీల విషయంలోనూ ఉక్కుపాదం మోపబోతోంది. నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు మరో వినూత్న మార్గాన్ని అన్వేషించబోతోంది. ఇకపై భూములు, బంగారం, గోల్డ్, బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేసిన వెంటనే ఐటీ శాఖ నుంచి మీ మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అవాక్కయ్యేలా ఉన్నా ఇది త్వరలో నిజం కాబోతోంది !

ఐటీ ఫోకస్‌లో 18 లావాదేవీలు !
ప్రధానంగా పద్దెనిమిది అధిక విలువ కలిగిన లావాదేవీలను టార్గెట్ చేసింది ఐటీ శాఖ. ముఖ్యంగా ప్యాన్ నెంబర్‌ను వెల్లడించాల్సిన ట్రాన్సాక్షన్స్‌కు ఎస్‌ఎంఎస్‌ను లింక్ చేయబోతోంది. సదరు లావాదేవీ జరిగిన వెంటనే ప్యాన్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయగానే ఐటీ శాఖకు సదరు వివరాలు వెళ్తాయి. ఈ ట్రాన్సాక్షన్ తమ దృష్టికి వచ్చింది అని తెలిపేలా ఐటీ శాఖ నుంచి కూడా మనకు మెసేజ్ అందుతుంది.
''ఇక నుంచి ఆదాయపు పన్ను శాఖ... అసెసీలు (ట్యాక్స్ పేయర్స్) అందరికీ అకౌంటెంట్ మాదిరి వ్యవహరించనుంది. లావాదేవీ పూర్తైన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్‌కు మెసేజ్ వచ్చేలా టెక్నాలజీ వేదికను రూపొందిస్తున్నాం. ఎక్కువ విలువ ఉన్న లావాదేవీల వివరాలను ఐటీ రిటర్న్స్‌లో కూడా విధిగా తెలియజేయాలని మేం కోరుతున్నాం ''- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ పి.సి. మోడీ

క్రాస్ చెక్ చేస్తారు
మీరు చేసే హై వేల్యూ ట్రాన్సాక్షన్ సమాచారం ఐటీ శాఖ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్లు కూడా మీరు దాఖలు చేసే రిటర్న్స్‌తో క్రాస్ చెక్ చేసుకునే వీలుంటుంది. అందుకని తప్పించుకునే అవకాశాలు ఉండవు అనేది ఐటీ శాఖ ఆలోచన. ఫైనాన్స్ బిల్ 2019 పాస్ అయిన తర్వాత ప్యాన్ స్థానంలో ఆధార్‌ను కూడా వాడే అవకాశం ఉంటుంది. అందుకే గరిష్టంగా చేసే లావాదేవీలపై ఇక నుంచి ఐటీ శాఖ దృష్టి ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ నెంబర్ ఉంది. అదే సమయంలో మార్చి నాటికి మన దేశంలో ప్యాన్ ఉన్న వాళ్ల సంఖ్య కూడా 44.57 కోట్లుగా ఉంది. వీటిల్లో సుమారు 25 కోట్ల ప్యాన్‌లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయి. ఇక మిగిలినవి కూడా ఆ సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లేకపోతే ఆ ప్యాన్ నెంబర్స్ పనిచేయవు అని ఐటీ శాఖ స్పష్టంగా హెచ్చరించింది.

ఏ ట్రాన్సాక్షన్స్ పరిధిలోకి వస్తాయ్
ఐటీ శాఖ 114బి ప్రకారం సుమారు 18 లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయి. వాటిల్లో టూ, ఫోర్ వీలర్ వాహనాల కొనుగోలు, బ్యాంక్ ఖాతా తెరవడం, నూతన క్రెడిట్ కార్డ్ వంటివి జాబితాలో వస్తాయి. వీటికి తోడు రూ.50 వేలకు మించి హోటళ్లు, రెస్టారెంట్లలో చేసే నగదు లావాదేవీలు, విదేశీ పర్యటనలకు టికెట్లు, విదేశీ కరెన్సీ కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు వంటివి ఉన్నాయి.
ఇవే కాకుండా ఒక రోజులో ఏదైనా బ్యాంక్ (కో ఆపరేటివ్, పోస్టాఫీస్ కూడా) ఖాతాలో రూ.50 వేలకుపైగా చేసే చేసే నగదు డిపాజిట్లు ఉన్నాయి. రూ. 1 లక్షకు విలువ ఉన్న సెక్యూరిటీలు (షేర్లు కాకుండా), రూ.10 లక్షలకు అంతకు పైగా విలువ ఉన్న స్థిరాస్థి కొనుగోలు - అమ్మకం కూడా హై వేల్యూ పరిధిలోకి వస్తాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications