ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ లో కూడా మందగమనం ఆవరిస్తోందా... కొన్ని గణాంకాలు చూస్తే మాత్రం ఇది నిజమేననిపిస్తోంది. గత 7-8 నెలలుగా దేశంలో ఆటోమొబైల్ రంగాన్ని చూసిన ఇదే స్పష్టమవుతోంది. కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఇలా అన్ని రకాల వాహనాల అమ్మకాలు పది పొయ్యాయి. కార్ల దిగ్గజం మారుతి సుజుకీకి కూడా ఈ సెగ తగిలింది. నెలలకూ అమ్మకాలు తీసికట్టుగా మారిపోతున్నాయి. దీనికి తోడు దేశంలో నిరుద్యోగ రేటు 48 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా దేశంలో కొనుగోళ్లు, విలీనాలు (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్) కూడా నెమ్మదించాయని తెలుస్తోంది. అంటే దేశంలో కనిపిస్తున్న దానికంటే ఆందోళనకర పరిస్థితులే ఉన్నట్లు ఉన్నాయి.

కేవలం 183 డీల్స్ మాత్రమే...
ప్రస్తుత సంవత్సరం లోని తోలి ఆరు నెలల కాలంలో దేశంలో కేవలం 183 కొనుగోళ్లు, విలీనాలు జరిగినట్లు మెర్జర్ మార్కెట్ అనే సంస్థ వెల్లడించింది. ఈ రిపోర్టును ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గతేడాది ఇదే ఆరు నెలల కాలంలో మన దేశంలో 234 డీల్స్ జరిగాయట. విలువ పరంగా చూసిన ఈ డీల్స్ విలుల 2019 లో కేవలం $34 బిలియన్ డొల్లర్లుగా నమోదు అయినట్లు సమాచారం. ఆసియ పసిఫిక్ రీజియన్ కొనుగోళ్లు, విలీనాలు విషయంలో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. కానీ ఇప్పుడు డీల్స్ విషయంలో మన దేశం వెనక పడేట్లు కనిపిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ డీల్స్ కూడా 42కు పడిపోయి కేవలం $4 బిలియన్ డొల్లర్లుగా నమోదు అయ్యాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఎగ్జిట్ అవ్వటం కూడా 93% తగ్గి కేవలం 23 డీల్స్ తో $2 బిలియన్ డాలర్ల స్థాయిలోనే నిలిచిపోయ్యాయి. 2018 తోలి ఆరు నెలల కాలంలో ఇవి ఏకంగా 36 డీల్స్, $32 బిలియన్ డాలర్ల మొత్తం కావడం గమర్హం.

ఐదేళ్ళలో అత్యల్పం ....
గత ఐదేళ్ల కాలంలో భారత్ ఆర్ధిక వ్యవస్థ తోలి సరి అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది కేవలం 6.8% నికి పరిమితమైంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్ధిక వృద్ధి రేటు జోరు అందుకుంటుందని పేర్కొంటోంది. ప్రభుత్వ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడుల రాక, విధానాల సరళీకరణ వల్ల వృద్ధి వేగం పుంజు కొంటుందని అభిప్రాయపడుతోంది. తద్వారా భారత జీడీపీ 7% చొప్పున వృద్ధి చెందుతుందని, అది కూడా 2019-20 ఆర్ధిక సంవత్సరంలోనే జరుగుతుందని పేర్కొంటోంది. అయితే, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల మందగమనానికి చెక్ పెట్టడంతో పాటు, ఉపాధి కల్పనా మెరుగు పరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఆలస్యమవుతున్న డీల్స్...
భారత్ లో నెలకొన్న లీగల్ వివాదాలు, పన్ను చెల్లింపుల వివాదాల పరిష్కారం నత్త నడకన సాగుతుండటం తో ఇప్పటికే ప్రకటించిన కొనుగోలు, విలీనాలు సైతం ముందుకు సాగటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ఆర్సెలర్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ కు చెందిన $6 బిలియన్ డాలర్ల డీల్ కూడా ఒక నిదర్శనమని వెల్లడిస్తున్నారు. మరిన్ని డీల్స్ కూడా ఇదే విధంగా ముందుకు సాగటం లేదని వారు పెదవి విరుస్తున్నారు.

చైనా వెనుక పడినా..
ఈ మధ్య కాలంలో చైనా రెండు రకాలుగా ఇబ్బంది పడుతోంది. అటు దేశంలో మందగమనం కొనసాగుతుండగా... ఇటు అమెరికా తో నెలకొన్న ట్రేడ్ వార్ తో దెబ్బతింటోంది. ఒక రకంగా భారత్ కు వరమని చెప్పాలి. కానీ దాన్ని మన దేశం సద్వినియోగం చేసుకోలేక పోతోంది. అమెరికా కంపెనీల డీల్స్ కూడా 91% తగ్గి కేవలం $2 బిలియన్ స్థాయిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి మాట ఎలా ఉన్న... వచ్చే ఆరు నెలల్లో నైనా భారత్ పుంజుకొంటుందేమో చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications