న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు తీసుకొని, ఇప్పుడు లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ఇంగ్లాండులో జరుగుతున్న ప్రపంచకప్ చూసేందుకు అక్కడకు వెళ్లాడు. అక్కడ వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌తో ఫోటో దిగి, సోషల్ మీడియాలో అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను వారిద్దరు పోస్ట్ చేశారు. నా డియర్ ఫ్రెండ్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌తో కలిసి ఫోటో దిగడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. బిగ్ బాస్‌తో కలిసి దిగడం ఆనందమని క్రిస్ గేల్ పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. చోర్ అంటూ పేర్కొన్నారు. దీనికి మాల్యా కూడా స్పందించాడు.

నన్ను ఎవరైతే చోర్ అంటున్నారో...
నన్ను ఎవరైతే చోర్ అంటున్నారో, వారంతా ఇండియన్ బ్యాంకులను తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలని సూచించాలని మాల్యా నెటిజన్లకు సూచించాడు. నేను ఏడాది కాలంగా డబ్బులు అన్నీ చెల్లించేందుకు సిద్ధమని చెబుతున్నానని అన్నాడు. ఇప్పుడు ఎవరు చోర్ అనేది తేల్చికోండి అన్నాడు. గేల్‌తో కలిసి తాను ఫోటో దిగి, పోస్ట్ చేస్తే చోర్ అంటున్నారని, నేను 100 శాతం డబ్బులు ఇస్తానని చెబుతున్నానన్నాడు.

మాల్యాపై ట్రోల్స్
నెటిజన్లు మాల్యాపై ట్రోల్స్ చేశారు. 'భారత్ వచ్చి జైల్లో ఫోటో తీసుకో', 'మాల్యా.. నీ కొడుకు కూడా చోర్', 'చోర్ చోర్ చోర్', 'మాల్యాను ఇండియాకు కొరియర్ చేయండి. రివార్డుగా మీకు (క్రిస్ గేల్) మిలియన్ డాలర్స్ వస్తాయి', 'సూపర్'.. అంటూ నెటిజన్లు స్పందించారు.

క్రిస్ గేల్‌కు సూచనలు
మాల్యాతో దిగిన ఫోటోను క్రిస్ గేల్ పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. 'మొదట నీ (గేల్) పాకెట్ చెక్ చేసుకో', 'మాల్యాను ఇండియాకు కొరియర్ చెయ్', 'అతను పారిపోయినవాడు అని నీకు (గేల్) తెలియదా', 'గేల్.. నీ అకౌంట్ డిటైల్స్ అతనితో (మాల్యా) షేర్ చేయకు. అతని ముందు ట్రాన్సాక్షన్స్ కూడా చేయకు. అతను బాధతో లోన్ అడిగినా ఇవ్వకు', 'అతను ఇండియా మనీ దోచుకెళ్లాడు', 'క్రిమినల్ మాల్యాతో దోస్తీ కట్ చేసుకో. రూ.9వేల కోట్లు అప్పగించమని చెప్పు', 'మీ బిగ్ బాస్.. ఇండియాకు బిగ్ లాస్' అని పెద్ద ఎత్తున నెటిజన్లు మాల్యాను ట్రోల్ చేశారు.


Click it and Unblock the Notifications