న్యూఢిల్లీ: 2022 నాటికి ప్రతి కుటుంబానికి ఇళ్లు లక్ష్యంగా ముందుకు సాగుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లు మంచి శుభవార్త చెప్పింది. ఇది మధ్య తరగతి వారికి ఎంతో ఊరట కలిగించే అంశం. ఇల్లు లేకుండా మొదటిసారి కొనుగోలు చేస్తే వారికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

ఆదాయపన్నులో అదనంగా రూ.1.5 లక్షల తగ్గింపు
రూ.45 లక్షలు లోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంటే రూ.1.5 అదనంగా పెరిగింది. గృహ రుణాలపై ఆదాయ పన్నులో అదనంగా రూ.1.5 లక్షలు డిడక్షన్ ఎంతోమందికి ఊరట. హౌసింగ్ సెక్టార్‌ను ప్రోత్సహించేందుకు, అందరికీ ఇల్లు లక్ష్యానికి ఇది బూస్ట్.

2020 మార్చి 31 వరకే...
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24(b) కింద అనుమతించిన రూ.2 లక్షల పన్ను మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, ఇది మార్చి 31, 2020 వరకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఇంటి విలువ రూ.45 లక్షలకు మించరాదు.

మరింత ఊపందుకోనున్న రంగం..
ఇప్పటికే గత మధ్యంతర బడ్జెట్‌లో జీఎస్టీని భారీగా తగ్గించడంతో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం ఊపందుకుంది. అన్ని నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పుడు ఆదాయ పన్ను విషయంలో మరోసారి మధ్యతరగతి వారికి మంచి మినహాయింపు ఇవ్వడంతో ఈ రంగం మరింత ఊపందుకోనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications