న్యూఢిల్లీ: వాహనదారులపై స్వల్ప భారం పడనుంది. ఇంధన ధరలపై స్వల్ప సుంకాలు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సమయంలో వెల్లడించారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఒక్క రూపాయి చొప్పున సెస్ విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఇంధన ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.

నష్టాల్లో HPCL, BPCL, IOC షేర్లు
పెట్రోల్, డీజిల్ పైన ఒక్కో రూపాయి చొప్పున సెస్ విధింపు నేపథ్యంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) షేర్లు పడిపోయాయి. ఈ సంస్థల షేర్లు 5-6 శాతం నష్టపోయాయి. ఇంధనపై సెస్ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నెగిటివ్ వార్త అని, అందుకే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

కేంద్రానికి ఇలా ప్రయోజనం
పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఒక్కో రూపాయి చొప్పున సెస్ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్థూల ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. దేశంలో పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ఉపయోగం ఉంది. దీంతో రెవెన్యూ పెరగనుంది. అంతిమంగా ద్రవ్యలోటును అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, నిధుల వ్యయానికి కూడా ఉపయోగపడుతుంది.

వివిధ కంపెనీల షేర్లు ఇలా...
మధ్యాహ్నం బీఎస్ఈలో దేశీయ మార్కెట్లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) షేర్లు 2.87 నష్టపోయి రూ.152.10 వద్ద ట్రేడ్ అయింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) షేర్లు 1.14 శాతం తగ్గి, రూ.285.30 వద్ద ట్రేడ్ అయింది. BPCL షేర్ 2.47 శాతం నష్టపోయి రూ.370.45 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications