ఎరుపు వస్త్రంతో.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం....

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆర్థికమంత్రి ప్రసంగం ఇలా.... మా ప్రభుత్వానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. అందరూ మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. నవభారతం కోరుకుంటున్నారు. పనితీరు, సంస్కరణలతో కొత్త ఒరవడి సృష్టించాం. దేశంలోని ప్రతి మూలా, ప్రతి ఒక్కరికీ పథకాలు చేర్చడమే తమ లక్ష్యం. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పరిపాలన. ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు. శక్తివంతమైన దేశం కావాలంటే శక్తివంతమైన పౌరులు కావాలి. లక్ష్యాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది.

బలమైన సంకల్పం ఉంటే కఠిన లక్ష్యాలను సాధించవచ్చు. జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతి తమ లక్ష్యం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యం. ఆహార భద్రతకు వ్యయం రెట్టింపు చేశాం. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉంటుంది. అట్టడుగు వర్గాల వరకు సేవ మా లక్ష్యం. ప్రపంచంలో అతిపెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థ భారత్. నవీన భారత నిర్మాణానికి అడుగులు వేస్తున్నాం. పర్యావరణరహిత వృద్ధి తమ లక్ష్యం. ఈ ఏడాది భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఉంది. నవ భారతావని కోరికలు తీర్చుతాం. సంపదను సృష్టిస్తాం.

Budget 2019 Updates: inance Minister Nirmala Sitharaman presents her maiden Budget

మౌలిక వసతుల కల్పన కోసం భారీగా పెట్టుబడులు ఉంటాయి. మేకిన్ ఇండియాకు మంచి స్పందన ఉంది. ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. పీపీపీ విధానంలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో ఉన్నాం. అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. మేకిన్ ఇండియాను పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకున్నారు. దేశీయ, విదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ముద్ర యోజన సామాన్యుడి జీవితాన్ని మార్చివేసింది.

ఆహార భద్రతకు వ్యయం రెట్టింపు చేశాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన లక్ష్యం. ఎయిర్ క్రాఫ్ట్ ఫైనాన్సింగ్ పైన ప్రత్యేక దృష్టి సారించాం. భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పని చేస్తున్నారు. రవాణా రంగాన్ని పారిశ్రామిక రంగంతో కనెక్ట్ చేస్తాం. ఇండస్ట్రియల్ కారిడార్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మేం తెచ్చిన పథకాలు సామాన్యుడి జీవితంలో మార్పులు తెచ్చాయి. 2018-19లో 300 కిలో మీటర్ల మెట్రో లైన్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. దేశంలో ప్రస్తుతం 657 కిలో మీటర్ల మెట్రో లైన్ల నిర్మాణం జరిగింది.

రూపే కార్డుతో బహుళ సేవలకు అవకాశం లభించింది. ఒకే కార్డుతో పార్కింగ్ ఫీజు, బస్సు ఛార్జీ, అనేక చెల్లింపులకు అవకాశం లభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే బ్యాటరీలకు రాయితీలు. సరుకు రవాణా కోసం నదీ మార్గాల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చాం. భారత్ మాలా, సాగర్ మాలా, ఉడాన్ స్కీంలు తీసుకు వచ్చాం. ఇవి మన రవాణా పెంపుకు ఉపయోగపడుతున్నాయి. గంగానదిలో ఇప్పటికే సరుకు రవాణా పెరిగింది. రైల్వేలకు ఏటా లక్షన్నర కోట్లు అవసరం. సాహిబ్ గంజ్, హల్దియాలో సరుకు రవాణా కేంద్రాలు ఏర్పాటు. ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చాం.

దేశంలో ప్రస్తుతం 657 కిలో మీటర్ల లైన్ల మెట్రో నిర్మాణం జరిగింది. ఇండియన్ కంపెనీలు స్వదేశీని గౌరవిస్తున్నాయని, మేకిన్ ఇండియాకు అండగా ఉన్నాయి. ఉద్యోగ కల్పన కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరిన్ని పెట్టుబడులు అవసరం. 2018 నుంచి 2030 మధ్య రైల్వే ఇన్ఫ్రా రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ప్రభుత్వం షాప్ కీపర్స్‌కు కొత్త పథకం ప్రవేశ పెడుతోంది. దీంతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. డిక్లరేషన్‌ను అనుసరించి 30 మిలియన్ల రిటైల్ ట్రేడర్స్‌కు పెన్షన్ స్కీం వర్తింప చేయనున్నారు.

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ప్రయివేటు, ప్రభుత్వ పార్ట్‌నర్‌షిప్. తద్వారా రైల్వేలో ప్రయివేటు పెట్టుబడులకు ప్రోత్సాహం. రైల్వేలకు ఏటా రూ.లక్షన్నర కోట్ల అవసరం. దేశంలో అందరికీ విద్యుత్ అందించే వన్ నేషన్, వన్ గ్రిడ్. ఈ ఏడాదిలనే గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్ ఏర్పాటు. విదేశీ పెట్టుబడులను పెంచేందుకు కీలక నిర్ణయాలు. ఉడాన్ పథకంలో చిన్న నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి పెద్దపీట. మేకిన్ ఇండియా కింద విమానాల తయారీ. అద్దెకు ఉండే వారి హక్కుల కోసం కొత్త విధానం. అందరికీ ఇల్లు అందించడంపై దృష్టి.

మధ్యతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం. మధ్యతరహా పరిశ్రమలకు రూ.350 కోట్లు కేటాయింపు. మౌలిక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావాల్సి ఉంది. ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్‌ధన్ స్కీం ప్రారంభం. రూ.1.5 కోట్లతో ఈ స్కీం కింద షాప్ కీపర్స్, రిటైలర్స్‌కు పెన్షన్ స్కీం. జీఎస్టీ కోసం నమోదు చేసుకున్న వారికి 2 శాతం రాయితీ. ఇందుకు రూ.350 కోట్లు కేటాయింపు. ఎంఎస్ఎంఈలకు 2 శాతం వడ్డీతో రూ.కోటి రుణం. సమీకృత అభివృద్ధి కోసం అన్ని వర్గాలకు చేరువగా స్టాక్ మార్కెట్లు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడుల వరద తగ్గింది. గత ఏడాది భారత్‌కు 64.37 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.

మీడియా, ఏవియేషన్ రంగాల్లో FDIలకు అనుమతి. త్వరలో ఆదర్శ అద్దె విధానం. గాంధీ 150వ జయంతి సందర్భంగా అంత్యోదయ పథకం. KYC విధానంలో మార్పులు. లబ్ధిదారులకు రూ.1.95 కోట్ల గృహాలు. ఇండస్ట్రియల్ కారిడార్లలో మౌలిక వసతులకల్పన. లిస్టెడ్ కంపెనీలకు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ పెంచాలి. ఇది 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని SEBIని కోరినట్లు చెప్పారు. ఇండియాలో యాన్యువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను పెంపొందిస్తాం. ఆర్థిక వ్యవస్థ మార్పుకు గ్రామాల నుంచి రూరల్ మార్కెట్స్‌కు రోడ్ కనెక్టివిటీ అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేజ్ 3 కింద రానున్న 5 ఏళ్లలో 1,25,000 కిలో మీటర్ల రోడ్లు వేయనున్నాం.

అంతరిక్ష రంగంలో ఇండియా దూసుకెళ్తోంది. మన సామర్థ్యాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకునే సమయం వచ్చింది. హర్.. హర్.. జల్ పథకం కింద 2.24 నాటికి ప్రతి ఇంటికి నీరు. ఇంట్లో వాడిన వృథా నీటిని పొలాలకు మళ్లింపు. 206 జిల్లాలో నీటి కటకట ఉంది. వ్యవసాయరంగ మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తాం. 2014 అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 9.6 కోట్ల టాయిలెట్స్ నిర్మించాం. దీంతో 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జనరహిత గ్రామాలుగా మారాయి. స్వచ్ఛభారత్‌ను ప్రతి గ్రామంలో సస్టయినబుల్ సోల్డ్ వేస్టేజ్ మనేజ్‌మెంట్‌‌కు విస్తరిస్తాం. ఎన్నారై పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్‌మెంట్ రూట్‌ను ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్‌మెంట్‌లో విలీనం.

2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు కోసం కృషి. 2022 నాటికి 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. 5.6 కోట్ల గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటన. అర్బన్ ఇండియాలో 81 లక్షల గృహాల నిర్మాణం. మెట్రో రైలులో ప్రయివేటు పెట్టుబడులకు ప్రోత్సాహం. జాతీయ పరిశోధన ఫౌండేషన్ ఏర్పాటు. 2019-20నాటికి విద్యా సంస్థల ప్రమాణాలు పెంచేందుకు రూ.400 కోట్లు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఇండియా. త్వరలో విద్యా పాలసీ. ఉన్నత విద్యా సంస్థల రెగ్యులేటర్ విధానంలో మార్పులు.కోటి మంది యువతకు నైపుణ్యాల శిక్షణ. 10 లక్షల మందికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ.

ఖేల్ ఇండియాలో పథకం కింద క్రీడలకు ప్రోత్సాహం. అన్ని మంత్రిత్వ శాఖల ద్వారా ఫౌండేషన్‌కు నిధులు. వరల్డ్ టాప్ 200 యూనివర్సిటీలలో దేశంలోని 3 సంస్థలకు చోటు. కార్మిక చట్టాల సరళీకరణ. కార్మికుల సంక్షేమం కోసం నాలుగు లేబర్ కోడ్‌లు. బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా కొత్త టీవీ ఛానల్‌. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకు అప్పగింత. PMAY (Urban) కింద రూ.4.83 లక్షల కోట్లతో 81 లక్షల ఇళ్లు శాంక్షన్. ఇందులో 47 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 24 లక్షల ఇళ్లు డెలివర్ అయ్యాయి.

మహిళల నాయకత్వానికిప్రోత్సాహం. 'నారీ తు నారాయణి' అనే సామెతను ఆమె లోకసభలో ప్రస్తావించారు.ముద్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ.1 లక్ష రుణం.భారత పాస్‌పోర్ట్ కలిగిన ఎన్నారైలకు ఆధార్ కార్డులు. ఎన్నారైలు 180 రోజులు ఎదురుచూడకుండా వెంటనే ఆధార్ కార్డులు.2019-20లో కొత్తగా నాలుగు ఎంబసీలు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో కొత్తగా కార్యాలయాలు.బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులు రూ.1 లక్ష కోట్లు తగ్గాయి. నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తుల రికవరీ. 6 ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం.పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7వేల కోట్ల మూలధనం. బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన.నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు ప్రాధాన్యం. NBFCలకు వన్ టైమ్ క్రెడిట్ గ్యారంటీ.వచ్చే అయిదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్ష కోట్ల పెట్టుబడులు.

ఎయిరిండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు.మౌలిక రంగం అభివృద్ధికి ఐడీయాస్ స్కీం.17 ఐకానిక్ టూరిజం సైట్ల అభివృద్ధి. మౌలిక రంగం అభివృద్ధికి ఐడియాస్ స్కీం.సోషల్‌ ఎంటర్‌ప్రైజస్ చేయూతకు ఎలక్ట్రానిక్ విధానంలో నిధుల సేకరణ. ఇందుకు ప్రత్యేక వేదిక.త్వరలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 కొత్త నాణేలు విడుదల. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణేలు.

రూ.11.37 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం. ఇది 7 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి అభినందనలు.డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు 78 శాతం పెరిగాయి. ట్యాక్స్ కలెక్షన్లు 2013-14 రూ.6.38 కోట్ల నుంచి ఇప్పుడు 11.27 కోట్లకు పెరిగాయి.NFBCలకు వన్ టైమ్ క్రెడిట్ గ్యారెంటీ.వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతం. ఎలక్ట్రికల్స్‌పై తగ్గింపుకు జీఎస్టీ కౌన్సెల్ ఆమోదం. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు తగ్గనున్నాయి.రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు 25 శాతం కార్పోరేట్ పన్ను మినహాయింపు.
స్టార్టప్‌లకు ఐటీ స్క్రూటినీ నుంచి మినహాయింపు.పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు. ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ లేదా పాన్‌కార్డ్.120 కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు పాన్‌కార్డ్ లేకుంటే ఆధార్ చూపించవచ్చు. రెండింట్లో ఏదైనా చూపించవచ్చు.
గృహ రుణాలు తగ్గనున్నాయి. గృహ రుణాలపై అదనంగా రూ.లక్షన్నర వడ్డీ తగ్గింపు. మొత్తంగా హోమ్ లోన్ పైన రూ.3.5 లక్షల వరకు వడ్డీ మాఫీ.

ఇది మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తే ప్రోత్సాహకాలు. రూ.45 లక్షలు లోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.ఏడాదికి రూ.కోటి దాటిన విత్ డ్రాయల్స్ మీద 2 శాతం టీడీఎస్.
వ్యక్తి ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఇక నుంచి 25 శాతం పరిధిలోకి వస్తాయి.డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు. కస్టమర్ డిజిటల్ పేమెంట్స్ పైన సర్వీస్ ఛార్జీలు రద్దు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 121వ ర్యాంకులో భారత్.
పెట్రోలుపై రూపాయి సెస్.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+