న్యూఢిల్లీ: మీకు పాన్‌కార్డ్ లేదా? అయితే గుడ్ న్యూస్. ఇకపై మీ ఆధార్ కార్డు నెంబర్‌ను పాన్ నెంబర్‌గా ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 120 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డు ఉందని గుర్తు చేశారు. అందుకే పాన్ - ఆధార్ నెంబర్లను పరస్పరం మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఏదైనా వెరిఫికేషన్ సమయంలో పాన్ కార్డు లేకుండే ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లేకుంటే పాన్ కార్డ్ వినియోగించుకోవచ్చు. అలాగే, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇప్పటి వరకు పాన్ కార్డ్ తప్పనిసరి. ఇక నుంచి పాన్ కార్డ్ లేకుంటే ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటరన్స్ దాఖలు చేయవచ్చు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రసంగంలో ఆమె ఏం చెప్పారంటే... మా ప్రభుత్వానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. అందరూ మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. నవభారతం కోరుకుంటున్నారు. పనితీరు, సంస్కరణలతో కొత్త ఒరవడి సృష్టించాం. దేశంలోని ప్రతి మూలా, ప్రతి ఒక్కరికీ పథకాలు చేర్చడమే తమ లక్ష్యం. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పరిపాలన. ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారు. శక్తివంతమైన దేశం కావాలంటే శక్తివంతమైన పౌరులు కావాలి. లక్ష్యాలు సాధిస్తామనే విశ్వాసం ఉంది.
బలమైన సంకల్పం ఉంటే కఠిన లక్ష్యాలను సాధించవచ్చు. జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతి తమ లక్ష్యం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యం. ఆహార భద్రతకు వ్యయం రెట్టింపు చేశాం. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉంటుంది. అట్టడుగు వర్గాల వరకు సేవ మా లక్ష్యం. ప్రపంచంలో అతిపెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థ భారత్. నవీన భారత నిర్మాణానికి అడుగులు వేస్తున్నాం. పర్యావరణరహిత వృద్ధి తమ లక్ష్యం. ఈ ఏడాది భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఉంది. నవ భారతావని కోరికలు తీర్చుతాం. సంపదను సృష్టిస్తాం.
మౌలిక వసతుల కల్పన కోసం భారీగా పెట్టుబడులు ఉంటాయి. మేకిన్ ఇండియాకు మంచి స్పందన ఉంది. ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. పీపీపీ విధానంలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో ఉన్నాం. అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. మేకిన్ ఇండియాను పారిశ్రామికవేత్తలు అర్థం చేసుకున్నారు. దేశీయ, విదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ముద్ర యోజన సామాన్యుడి జీవితాన్ని మార్చివేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications