ప్రముఖ ఫుడ్ అగ్రిగేటింగ్, డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ వంటి సంస్థలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమన్లు జారీ చేసింది. అడ్డగోలుగా డిస్కౌంట్లు ఇస్తూ ఈ రంగంలోని వ్యాపారాన్ని దెబ్బతీస్తూ చిన్నచితకా రెస్టారెంట్ల మనుగడకు ప్రమాదకరంగా మారిన ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వెల్లువలా వచ్చినపడిన ఫిర్యాదుల నేపధ్యంలో కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేట్టు కనిపిస్తోంది.
తాజాగా వివిధ సంస్థలతో భేటీ అయిన కేంద్ర సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. ఈ అంశాన్ని సీరియస్‌గానే పరిగణిస్తోంది. ఫుడ్ అగ్రిగేటర్లు డీప్ డిస్కౌంట్స్ ఇవ్వడం మొత్తం పరిశ్రమనే ముంచేసే పరిస్థితి తెచ్చిందనేది రెస్టారెంట్ల ప్రతినిధులు వాదన. అందుకే సుమారు 500 మందికిపైగా ఓనర్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఈ మధ్యే స్పందించిన వాణిజ్య - పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ కూడా అగ్రిగేటింగ్ సంస్థలపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రిడేటివ్ ప్రైసింగ్‌తో చిన్న రిటైలర్లు, కిరాణా షాపులు తుడిచిపెట్టుకుపోతే చూస్తూ ఊరుకోబోము అనేది ఆయన మాట. అందుకే అందరి వ్యాపార ఆసక్తులనూ దృష్టిలో పెట్టుకుని త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇతర ఈ-కామర్స్ సంస్థలతో పోలిస్తే వీళ్ల బిజినెస్ మోడల్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. గత గురువారం జరిగిన భేటీలో ఫుడ్ అగ్రిగేటర్లతో పాటు ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో అనకే కీలక అంశాలపై చర్చలు జరిపారు.

ఇద్దరూ అవసరమే
వాస్తవానికి ఒకరి ప్రయోజనాన్ని చూస్తే మరొకరు నష్టపోతారు. ఎందుకంటే ఫుడ్ అగ్రిగేటింగ్ వ్యాపారంలోకి పెద్ద పెద్ద సంస్థలు దిగి కోట్ల రూపాయల పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ఇప్పుడు మన దేశం ఆంక్షలు విధిస్తే వాటికి విఘాతం కలగడంతో పాటు పెట్టుబడిదార్ల నమ్మకాన్ని కోల్పోతాం. అలా అని చూస్తూ ఊరుకుంటే చిన్న సంస్థలు, కిరాణా దుకాలు, ఫిజికల్ రెస్టారెంట్లు మూతబడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇరు వర్గాలతో మొదటిసారి చర్చలు జరిపిన కేంద్ర సంస్థ, దీనిపై మధ్యస్థంగా నిర్ణయం తీసుకునేట్టు కనిపిస్తోంది.

ప్రైవేట్ లేబుల్స్ మరో తలనొప్పి
ఆన్ లైన్ రెస్టారెంట్లతో పాటు ఆఫ్ లైన్ రెస్టారెంట్లకు కూడా ఎర్త్ పెడ్తున్నాయి కొన్ని అగ్రిగేటింగ్ సంస్థలు. వాళ్లే స్వయంగా రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లను తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దీని వల్ల ఆఫ్‌లైన్ వాళ్లపై ప్రభావం పడ్తోందనేది మరికొందరి వాదన. కన్స్యూమర్లకు మొదట అలవాటు చేసి ఆ తర్వాత ఆప్షన్స్ తగ్గించేసి, వాళ్ల సొంత లేబుల్స్‌ను అమ్ముకుని ఎక్కువ మార్జిన్లు పొందుతున్నాయని చెబ్తున్నారు.

ఇప్పటికీ నష్టాలే
మూడు, నాలుగు ప్రధాన సంస్థలు ఫుడ్ అగ్రిగేటింగ్ బిజినెస్‌లో ఉన్నారు కానీ లాభాల్లో ఉన్న సంస్థలు మాత్రం లేవు. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ సంస్థలు నెలకు కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తున్నాయి. కస్టమర్లకు 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్లు, డెలివరీ సంస్థలకు భారీగా ఫీజులు వంటివి దెబ్బతీస్తున్నాయని తెలిసినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సమన్లకు ఈ సంస్థలు ఏం సమాధానం చెబ్తాయి, రెస్టారెంట్ల భవితవ్యం ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications