జీడీపీ, వ్యవసాయం, చమురు ధరలు... పార్లమెంటులో ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు... నేడు (జూలై 4) పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. ఆర్థికమంత్రి దీనిని ప్రవేశ పెట్టారు. మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలో, 12 గంటలకు లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. 2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో NBFC ఆశించిన మేర లేదని పేర్కొంది.
జనవరి నుంచి మార్చి వరకు ఆర్థిక ప్రగతి వేగం తగ్గిందని, అందుకు ఎన్నికలే కారణమని అభిప్రాయపడింది. 2019లో సాధారణ ద్రవ్యలోటు 5.8 శాతం, 2018లో 6.4 శాతంగా ఉందని పేర్కొంది. ఆహార ధాన్యాల ధరలు తగ్గడం వల్ల 2019లో ఉత్పత్తి తగ్గి ఉండవచ్చునని అభిప్రాయపడింది. చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొంది.
చదవండి: ఇళ్లు కొనేవారికి అదనపు ట్యాక్స్ రాయితీ ప్రయోజనాలు!

7 శాతం జీడీపీ అంచనా
ఎన్పీఏలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. మూలధన వ్యయాల పెంపుకు ఇది సహకరిస్తుంది. 2026 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం జీడీపీ వృద్ధి రేటు అంచనా వేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం వృద్ధి రేటు 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

చమురు ధరలు తగ్గే అవకాశం
ఆర్థిక సర్వేలో ఇంకా... 2019-20లో చమురు ధరలు తగ్గే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులు గత ఏడాది తగ్గాయి. ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ పరీక్షల నిర్వహణ. 2026 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్. వృద్ధి రేటు 8 శాతం దాటితే సాధ్యం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను పారెక్స్ నిల్వలు 412.9 బిలియన్ డాలర్లుగా అంచనా.

పెట్టుబడుల వృద్ధి రేటు పెరిగే అవకాశం
డిమాండ్, రుణ లభ్యత పెరగడంతో 2020లో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం. వ్యయాలు పెరగడం, ప్రయివేటు పెట్టుబడుల్లో వృద్ధి కారణంగా 2019-20లో జీడీపీ వేగం అందుకుంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య ఘర్షణలు పెరగడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం. చమురు ధరలు అందుబాటులో ఉండటం వల్ల వినిమయ శక్తి పెరగవచ్చు. ఈ ఏడాది మరింత తగ్గవచ్చు.

సుస్థిర ప్రభుత్వం కారణంగా..
పెట్టుబడుల రేట్ 2011-12 నుంచి క్రమంగా తగ్గుతోంది. 2019-20 నుంచి మళ్లీ పెట్టుబడుల రేటు పెరిగే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల్లో వృద్ధి కనిపించే అవకాశముంది. 2018 వరకు ఈ వృద్ధి నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి పెరుగుదల కనిపించింది. వృద్ధిరేటులో మందగమనం, జీఎస్టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. సుస్థిర ప్రభుత్వం కారణంగా పెట్టుబడులు పెరిగే అవకాశం. FDIల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశం.


Click it and Unblock the Notifications