న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట ఇస్తారా, తద్వారా రియల్ ఎస్టేట్‌లో మరింత ఊపు తీసుకు వస్తారా? అనేది జూలై 5న తెలియనుంది. ఇప్పటికే ఇంటర్మ్ బడ్జెట్‌లో జీఎస్టీ 8 శాతం నుంచి 1 తగ్గించడంతో రియల్ బూమ్ ఊపందుకుంది. అదే బడ్జెట్‌లో రెండో ఇంటిపై కూడా ట్యాక్స్ వెసులుబాటు కల్పించింది బీజేపీ ప్రభుత్వం.

LTCGపై మరింత వెసులుబాటు ఆశలు
ఈ బడ్జెట్‌లో ప్రతి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ పైన రూ.2 లక్షల వరకు వడ్డీ డిడక్షన్ వెసులుబాటు కల్పించవచ్చునని భావిస్తున్నారు. దీంతో రెండు ఇళ్లకు కలిపి రూ.4 లక్షల వెసులుబాటు అవుతుంది. లేదా మొదటి ఆస్తి పైన రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచవచ్చునని భావిస్తున్నారు. అలాగే, దీర్ఘకాలిక మూలధన పన్ను (LTCG-లైఫ్ టైమ్ కేపిటల్ గెయిన్స్)పై ఇదివరకు ఒకే ఇంటిపై పన్ను మినహాయింపు కొరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫిబ్రవరి 1, 2019న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రూ.2 కోట్ల వరకు రెండు ఇళ్లపై పన్ను క్లెయిమ్ చేసుకునే విధంగా ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు దీనిని రూ.3 కోట్లకు పెంచుతారని భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు..
ఇదిలా ఉండగా, ఇళ్లను కొనుగోలు చేసే వారికి అదనపు పన్ను రాయితీ ప్రయోజనాలు అందించాలని నిర్మలా సీతారామన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌ను కోరారు. హోమ్ బయ్యర్స్ స్థోమతకు తగినట్లుగా విధానాలు ఉండాలని సూచించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆమెను పలువురు రియల్ ఎస్టేట్ డెవలపర్లు కలిశారు. పలు అంశాలు ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. తాము భూములు సేకరించే ప్రక్రియపై కేంద్రం పునరాలోచన చేయాలని, ప్రస్తుతం ఉన్న విధానాలు పరిశీలించాలన్నారు. ప్రస్తుత విధానాలు సరిగ్గా పని చేయట్లేదన్నారు.

మోడీ ప్రభుత్వం సంస్కరణలు
మోడీ ప్రభుత్వం గత అయిదేళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చిందని, రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం (రేరా), జీఎస్టీ, 2022 కల్లా అందరికీ ఇల్లు పథకం వంటివి రియల్ రంగానికి ఊతమిచ్చాయని చెబుతున్నారు. ఇలాంటి సంస్కరణలు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చాయన్నారు. గత మధ్యంతర బడ్జెట్లో హోమ్ బయ్యర్స్‌కు పలు విధాలుగా పన్ను రాయితీ ఇచ్చారని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications