న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన ఆయా రంగాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను అంశంలోను ముఖ్యంగా ఐదు మార్పులు ఉంటాయని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు ఈ బడ్జెట్‌లో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం సెక్షన్ 80సీ, సెక్షన్ 80 డి వంటి రాయితీలను ప్రకటించినా ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపులు ఏం కోరుకుంటున్నారు?
సెక్షన్ 80 డీ కింద వచ్చే ప్రయోజనాలను పెంచాలని కోరుకుంటున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు పెరిగే అవకాశముందంటున్నారు. జాతీయ పింఛన్ పథకంలో వీలైనంతమంది చేరేలా కృషి చేస్తే, ఇది లబ్ధిదారులకు ప్రయోజనకరమని అంటున్నారు. అలాగే, పెట్టుబడుల అలవాట్లు పెంచేలా ట్యాక్స్ విధానం ఉండాలని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు పలు దేశాల్లో వివిధ మార్గాలు ఉన్నాయి. ట్యాక్స్ ఎక్సెంప్షన్ పరిధిని రూ.3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. ఇలా చేస్తే ట్యాక్స్ పేయర్స్‌కు రూ.2,500 ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, NPS స్కీంలో రిలీఫ్ కోరుకుంటున్నారు. సెక్షన్ డీ డిడక్షన్ పరిధిని పెంచుతారని భావిస్తున్నారు.

ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో అందరికీ ప్రయోజనం
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ట్యాక్స్-ప్రీ బ్రాండ్స్‌ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. ఇది ట్యాక్స్ పేయర్స్‌తో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కల్పన కోసం ప్రభుత్వ సంస్థలకు మూలధన సమీకరణకు కూడా ఉపయోగపడుతుంది. వీటిని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌గా పిలుస్తారు. ఎందుకంటే వీటిపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉండదు. సాధారణంగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. పదేళ్లు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బాండ్స్‌ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎక్కువగా లబ్ధి పొందుతుందని చెబుతున్నారు.

ఈక్విటీ షేర్లు
లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ యూనిట్ల అమ్మకాలపై లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (LTCG) పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది ఏడాదికి రూ.1 లక్షగా ఉంది. దీనిని పెంచితే మరింత పెట్టుబడులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెబుతున్నారు. అయిదేళ్లు దాటి షేర్లు లేదా మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వారికి పన్ను రాయితీలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా ఉంది. వైద్యం ఖరీదుగా మారిందని, కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులు ఎక్కువగా పెంచాలని కోరుతున్నారు.

అలా ఆదాయం పెరగవచ్చు
నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ రంగంలో దూకుడు రావాలంటే గృహ నిర్మాణాలపై పన్ను రాయితీలు కోరుతున్నారు. ఇప్పటికే జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతం చేయడంతో రియల్ బూమ్ భారీగా పెరిగింది. పన్ను రాయితీలు ఇస్తే.. నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు జోరందుకుంటాయని, అప్పుడు జీఎస్టీ ద్వారా పన్ను రూపంలో ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications