భారీగా నష్టాల్లో ఉండి బిచానా ఎత్తేసిన రిలయన్స్ ఇన్ఫోకాంను ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. సంస్థ దివాలా తీయడంతో ఎవరూ సంస్థను కొనేందుకు ముందుకు రాలేదు . రిలయన్స్‌కు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా కొనుగోలు చేసి కేంద్ర టెలికాంశాఖకు బకాయిలు చెల్లించి ఆ తర్వాత కొన్న సంస్థే వినియోగించుకోవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. రిలయన్స్ ఇన్ఫోకాంకు సంబంధించి అన్ని కేబుల్స్ ఇతర సామగ్రి టవర్లను కూడా అమ్మకానికి పెట్టే యోచనలో యాజమాన్యం ఉంది.టెలికాంశాఖతో ఇకపై న్యాయపరమైన పోరాటం కోరుకోవట్లేదని యాజమాన్యం వెల్లడించింది. రానున్న వేలం పాటలో స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన టెలికాం సంస్థకు దీని వాలిడిటీ 20 ఏళ్లు ఉంటుందని రిలయన్స్ యాజమాన్యం స్పష్టం చేసింది
ఆర్‌కాం వైర్‌లైస్ ఆస్తుల్లో 4జీ స్పెక్ట్రమ్, 43వేల టెలికాం టవర్లను కూడా వేలం వేయనుంది. వేలం పాట ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు కట్టాలని యోచనలో రిలయన్స్ ఉంది.ఇప్పటి వరకు కేంద్రానికి బకాయిలు చెల్లించనందున రిలయన్స్ ఆర్‌కాం సంస్థ స్పెక్ట్రమ్ కేటాయింపులను కేంద్ర టెలికాంశాఖకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో టెలికాం శాఖ వాదనలు వినిపించింది. స్పెక్ట్రమ్ ప్రభుత్వం అధీనంలో ఉంటాయని 20ఏళ్ల వరకు మాత్రమే లీజుకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. ఆ స్పెక్ట్రమ్‌ను అమ్మలేరని వెల్లడించింది.

టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనచ్చని అయితే ముందుగా రిలయన్స్ ఇన్ఫోకాంకు సంబంధించిన బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని టెలికాంశాఖ తెలిపింది. జియో ఇన్ఫో కాంకు తొలుత తన స్పెక్ట్రమ్‌ను అమ్మాలని రిలయన్స్ ఆర్‌కాం ప్రయత్నించినప్పటికీ... పాత బకాయిలు కూడా చెల్లించాలని చెప్పడంతో రేసు నుంచి జియో పక్కకు తప్పుకుంది. ఆ సమయంలో మొత్తం రూ.7300 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications