వ్యక్తులకు సంబంధించిన టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎక్కువ మంది వ్యక్తులు, వేతనజీవులు సమర్పించే ఐటీఆర్-1ను ఈ సారికి ముందే పూరించి అందించనుంది. ఇందులో మీ వేతనం, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయం, మూలం వద్ద పన్ను (టీడీఎస్) వివరాలు ఉంటాయి. ఇంతకు ముందు ఈ వివరాలను వ్యక్తులే ఫామ్ లో నమోదు చేయవలసి ఉండేది. ఈసారి ఏవిధంగా తమ వివరాలు ముందుగానే ఫారం లో వస్తాయన్న సందేహం రావొచ్చు. ఆన్ లైన్ ద్వారా మీరు ఇంతకు ముందు ఐటీఆర్ -1 సమర్పించి ఉంటారు కదా. ఇవి కొత్త విధానానికి దోహదపడనున్నాయి. ఆదాయ పన్ను శాఖ ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ సాఫ్ట్ వేర్ మీ పాన్ నెంబర్ ఆధారంగా మీ ఎంప్లాయర్ సమర్పించిన టీడీఎస్, గత ఏడాదిలో మీ ఐటీఆర్ ఆధారంగా వివరాలను తీసుకుంటుంది. అయితే గత వివరాలకు, ప్రస్తుత వివరాలకు మధ్య తేడా ఉండవచ్చు. అప్పుడు ఎలాగా అన్న సందేహం వస్తుంది. ఎలాంటి వాటిని దృష్టిలో ఉంచుకునే ఆ వివరాలను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
* అయితే కొత్తగా తెచ్చిన సదుపాయం పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉండదు. ఐటీఆర్-1 ఫైనల్ చేసే వారే దీనికి అర్హులు. అంతే కాకుండా ఆదాయ పన్ను శాఖ ఈ- ఫైలింగ్ వెబ్ సైట్ ఆధారంగా ఫైల్ చేసేవారికి ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్సెల్ లేదా జావా ద్వారా ఫైల్ చేసేవారు వినియోగించే వారు మాత్రం వారే అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

* గత ఏడాది ఐటీఆర్ వివరాల ఆధారంగా వేతనం ద్వారా పొందే ఆదాయం,మినహాయింపు వివరాలు, టీడీఎస్ వివరాలు, బ్యాంకు వివరాలు ముందుగానే నమోదు చేసి ఉంటాయి కాబట్టి వీటిని సరిచూసుకున్న తర్వాతనే ఐటీఆర్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తప్పుగా వివరాలు సమర్పిస్తే ఆదాయ పన్ను శాఖ నుంచి భవిష్యత్ లో నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది.
* ఈ సంవత్సరం ఆదాయ పన్ను శాఖ ఫారం 16, ఫారం 24 క్యూ (ఇది ఎంప్లాయర్ ఫైల్ చేసే టీడీఎస్ రిటర్న్) ఫార్మాట్ లో స్వల్ప మార్పులు చేసింది. దీని వల్ల ఫారం 16 లోని వివరాలను కాపీ చేసుకొని ఐటీఆర్-1 ఫారం లో పేస్ట్ చేస్తే సరిపోతుంది.


Click it and Unblock the Notifications