వారికి 40 శాతం పన్ను వేయాలి: బడ్జెట్‌పై వారేం చెప్పారంటే?
న్యూఢిల్లీ: జూలై 5వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆయా రంగాలకు చెందిన వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేఎంపీజీ ఇండియా అనే సంస్థ ప్రీ బడ్జెట్ సర్వే చేసింది. ఇందులో ఎక్కువమంది ఇండివిడ్యువల్ ట్యాక్స్ మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి మరింత పెంచాలని కోరుకున్నారు. రూ.5 లక్షల వరకు పన్ను లేకపోయినప్పటికీ ఐటీ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఏడాదికి రూ.10కోట్ల ఆదాయం వచ్చే వారికి 40 శాతం పన్ను విధించాలని కోరుకున్నారు.

40 శాతం పన్ను విధించాలి
KPMG India సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 226 మంది నుంచి సమాచారం సేకరించింది. ఇందులో 74 శాతం మంది పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలు ఉందని, దానిని పెంచాలని కోరుకున్నారు. 58 శాతం మంది ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం కలిగిన వారికి అత్యధికంగా 40 శాతం పన్ను విధించాలని చెప్పారు.

ఇవి ప్రవేశ పెట్టవచ్చు
ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ లేదా ఎస్టేట్ సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చునని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. వారసత్వ పన్నును కూడా తిరిగి తీసుకు రావొచ్చునని 13 శాతం మంది చెప్పారు. హౌసింగ్ లోన్ వడ్డీకి పన్ను డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి పెంచాలని సర్వేలో పాల్గొన్న 65 శాతం మంది కోరుకున్నారు.

ప్రత్యక్ష పన్ను సవరణలపై...
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో మేజర్ ప్రత్యక్ష పన్ను సవరణలు ప్రవేశ పెడతారని ఆశించడం లేదని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. హౌసింగ్ లోన్ ప్రిన్సిపుల్ రీమెంట్ పైన డిడక్షన్ లిమిట్ రూ.1.5 లక్షలు ఉంది. ఇందులో మార్పులు చోటు చేసుకోవచ్చునని 51 శాతం మంది భావించారు. మరో నాలుగు రోజుల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications