న్యూఢిల్లీ: 2019 బడ్జెట్ ఓ వైపు ఇన్‌కం ట్యాక్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టడంతో పాటు న్యాయంగా ట్యాక్స్ కడుతున్న వారికి ప్రయోజనాలు కల్పించే అంశంపై కూడా దృష్టి పెట్టనుందని భావిస్తున్నారు. బేసిక్ ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపును పెంచడంతో పాటు సెక్షన్ 80సీ లిమిట్ కూడా పెంచుతారని భావిస్తున్నారు.

ఇది పెద్ద సవాల్
ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్.. వ్యక్తిగత పన్నుకు సంబంధించిన వసూళ్లు పెంచడం. ఇండివిడ్యువల్స్ ట్యాక్స్ పేయర్స్ 6.5 కోట్లకు పెరిగారు. కానీ ట్యాక్స్ కలెక్షన్స్ మాత్రం అంచనా వేసినంతగా లేవు. పన్ను రిటర్స్న్ దాఖలు చేసేంత ఆదాయం లేకపోవడం లేదా సరైన పన్నులు చెల్లించని వారు ఉండటం కారణం. అయితే టెక్నాలజీ సహకారంతో ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్‌ను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నుంచి ట్యాక్స్ పేయర్స్ కొన్ని కోరుకుంటున్నారు.

శాలరైడ్ ఏం కోరుకుంటున్నారు
బేసిక్ అసంప్షన్ లిమిట్ రూ.50 వేలు పెంచాలని కోరుకుంటున్నారు. అలాగే, మహిళా ట్యాక్స్ పేయర్స్ కూడా హయ్యర్ బేస్ ఎక్సెంప్షన్ లిమిట్ కోరుకుంటున్నారు. సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం రూ.1,50,000 ఉంది. దీనిని రూ.2,50,000 చేయాలని కోరుకుంటున్నారు. గృహ రుణాల అసలు చెల్లింపు వడ్డీకి ప్రస్తుతం రూ.2 లక్షల మినహాయింపు ఉంది. దీనిని రూ.3 లక్షలకు పెంచవచ్చునని భావిస్తున్నారు.

ఇలా చేస్తే.. ట్యాక్స్ కట్టేవారికి ప్రోత్సాహం
పైన చెప్పిన బెనిఫిట్స్ మధ్య తరగతి వారికి వర్తిస్తాయి. అయితే అత్యధిక ట్యాక్స్ కట్టే వారు కూడా ఉంటారు. ఉదాహరణకు రూ.10,00,000 నుంచి రూ.20,00,000 ఆదాయం కలిగిన వారు కట్టే ట్యాక్స్‌కు పై మినహాయింపులతో ప్రయోజనం ఉండదు. అయితే ప్రభుత్వం ట్యాక్స్ పే చేసే వారిని గుర్తించాలని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సర్టిఫికేట్లు జారీ చేస్తుందని చెబుతున్నారు. ట్యాక్స్ పే చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటే మరింతమంది ముందుకు వస్తారని చెబుతున్నారు. ఉదాహరణకు ట్యాక్స్ సరిగా పే చేసేవారికి గుర్తింపు కోసం కార్డ్ ఇస్తే.. ఆ కార్డును ఉపయోగించి టోల్ గేట్, విమానాశ్రయాలు, లాంజ్‌లకు ఉచితంగా అనుమతించే ప్రోత్సాహకాలు ఉండటం మంచి ఐడియా అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications