గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ)లో ఇక రెండు స్లాబ్స్ మాత్రమే ఉండనున్నాయా? అంటే కావొచ్చునని చెబుతూనే, భారత్ వంటి దేశాల్లో ఒకే స్లాబ్ అమలు అసాధ్యమన్నారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటికి... జూలై 1 రెండేళ్లు పూర్తయింది. 2017 జూలై 1 నుంచి ఈ పన్ను అమల్లోకి రావడంతో ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదం ఆచరణకు నోచుకుంది. అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్నుగా ప్రభుత్వం జీఎస్టీని తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జైట్లీ జీఎస్టీపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.

12-18 శాతం స్లాబ్‌లు కలిపే వెసులుబాటు
దాదాపుపు 20 రాష్ట్రాల్లో జీఎస్టీ కారణంగా 14 శాతం ఎక్కువ రెవెన్యూ కనిపిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ భర్తీ చేయాల్సిన పని లేదన్నారు. జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందన్నారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను స్లాబ్‌లు రెండుకు తగ్గే అవకాశముందన్నారు. ఆదాయం మరింత పెరిగితే ప్రస్తుతం ఉన్న 12 శాతం, 18 శాతం స్లాబ్‌లను కలిపే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో ఒకే పన్ను స్లాబ్ విధానాన్ని అమలు చేయడం దాదాపు అసాధ్యమన్నారు.

అత్యధిక ఉత్పత్తులు తక్కువ స్లాబ్‌లోనే
అయితే పేదలులేని, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకే ఇది వీలవుతుందని జైట్లీ పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో పేదలు ఉన్న దేశంలో ఒకే స్లాబ్ పన్నును అమలు చేయడం సరికాదన్నారు. హవాయి చెప్పులు, మెర్సిడెస్ కార్లను ఒకే విధంగా పరిగణించలేమన్నారు. సిన్ గూడ్స్, సౌకర్యవంతమైన వస్తువులు మినహా దాదాపు మిగతా వాటన్నింటినీ 28 శాతం స్లాబ్ నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఎక్కువ శాతం ఉత్పత్తుల్ని 18 శాతం, 12 శాతం, 5 శాతం స్లాబ్‌లోకి తీసుకు వచ్చామన్నారు. ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల గత రెండేళ్లుగా రూ.90,000 కోట్ల మేర నష్టం వచ్చిందన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు తేడా...
ప్రత్యక్ష పన్ను విధానం పురోగమన దిశగా తీసుకెళ్తే, పరోక్ష పన్నులతో తిరోగమన దిశలో వెళ్తామని జైట్లీ పేర్కొన్నారు. రాబడి పెరిగిన కొద్దీ పన్ను ఆదాయం పెరుగుతుందన్నారు. జీఎస్టీ అమలుకు ముందు పేద, ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒకే విధంగా పన్ను చెల్లించేవారని, ప్రత్యక్ష పన్నుల విధానం అమలులోకి వచ్చాక ద్రవ్యోల్బణం మందగించి, సామాన్య ప్రజలు వాడుకునే వస్తువులపై పన్నులు తగ్గాయని చెప్పారు. కాగా, 2017-18లో (జూలై నుంచి మార్చి వరకు) నెలకు యావరేజ్ రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018-19లో రూ.97,100 కోట్లు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications