బెర్న్: వివిధ రూపాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత అయిదేళ్ల పాలనతో పాటు, రెండో టర్మ్ అధికారంలోకి వచ్చాక కూడా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నోట్ల రద్దు, డిజిటలైజేషన్ వంటి చర్యలను చేపట్టింది. తాజాగా, స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) విడుదల చేసిన గణాంకాల్లో మరో అంశం వెలుగు చూసింది. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. ఈ మేరకు SNB గురువారం డేటా విడుదల చేసింది.

గణనీయంగా తగ్గుతున్న భారతీయుల నగదు పరిమాణం
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 20ఏళ్ల కనిష్టానికి చేరుకున్నాయని SNB విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. 20 రికార్డ్ స్థాయిలో పతనమైంది. అలాగే, భారత ఖాతాదారుల సంఖ్య కూడా తగ్గుతోందట. గత కొద్దికాలంగా స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్... అంటే మన రూపాయల్లో 6,757 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కావడం గమనార్హం.

ఇది రెండోసారి
రెండు దశాబ్దాల్లో ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇది రెండోసారి. SNB ప్రకారం స్విస్ బ్యాంకు అన్ని రకాల ఇండియన్ కస్టమర్ ఫండ్స్‌ను పరిగణలోకి తీసుకుంటుంది. ఇండివిడ్యుయల్స్, బ్యాంకులు, ఎంటర్‌ప్రైజెస్‌ల అమౌంట్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే, భారత్‌లోని స్విస్ బ్యాంక్ బ్రాంచీలు వంటివి కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. అయితే అక్కడ ఉన్నదంతా నల్లధనంగా చెప్పలేం. ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్లు ఎంత? అనే వివరాలు ఇందులో లేకపోవడం గమనార్హం.

భారతీయుల ధనం
2017లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం రూ.7వేల కోట్లు పెరిగింది. అయితే 2018లో స్విట్జర్లాండ్ కరెన్సీ... CHF 954.71 మిలియన్లు తగ్గింది. 1995 నుంచి ఇది రెండో కనిష్టం. 1995లో CHF 723 మిలియన్ నిధులకు తగ్గాయి. స్విట్జర్లాండ్ 1987 నుంచి డేటాను బహిరంగపరుస్తుంది. అప్పటి నుంచి CHF 675 మిలియన్లు 2016లో నమోదయింది. 2018లో ఇండియన్ క్లయింట్ల డిపాజిట్లు CHF 572 మిలియన్లు పెరిగినప్పటికీ, సెక్యూరిటీస్, ఇతర సాధనాల ద్వారా బ్యాంకుల్లో ఉన్న డబ్బు గణనీయంగా క్షీణించింది. 2017లో రూ.7వేల కోట్లు తాకింది.

మూడుసార్లు పెరిగాయి..
BIS డేటా ప్రకారం బ్యాంకింగేతర లేదా భారతీయ వ్యక్తిగత కస్టమర్ల డిపాజిట్లు 2018 చివరి నాటికి 84.6 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది (2017)లో ఇది 94.8 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అంతకుముందు ఏడాది కంటే 11 శాతం తగ్గింది. స్విస్ బ్యాంకులో భారతీయుల ధనం 2006లో రూ.23,000 కోట్లుగా ఉంది. ఇదే అత్యంత గరిష్టస్థాయి. దశాబ్ద కాలంలో ఇది పదో వంతుకు చేరుకుంది. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం, 2017 50 శాతం పెరిగాయి.
అలాగే, స్విస్ బ్యాంకులో మొత్తం ఫారన్ అగ్రిగేటర్ ఫండ్స్‌లో 2018లో 1.4 శాతం పడిపోయాయి. ఈ మొత్తం విలువ రూ.99 ట్రిలియన్లు.

ఈ వివరాలు లేవు
ఈ డిపాజిట్లలో నల్లధనం ఎంత, సక్రమ డిపాజిట్లు ఎంత అనే వివరాలు లేవు. అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు ఈ డేటాలో లేవు. భారత్‌లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని SNB ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్‌మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నల్లధనంపై పోరును ప్రారంభించిన మోడీ ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సమాచార మార్పిడి ఒప్పందం చేసుకుంది. ఇది 2018 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే నల్లధనం కుబేరుల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం విడుతలవారీగా కేంద్రానికి తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది భారతీయుల సంపద స్విస్ బ్యాంకుల్లో మరింతగా తగ్గవచ్చన్న అంచనాలున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications