''మీకు ఐటి శాఖ నుంచి రీఫండ్ వచ్చింది ! ఇంకొన్ని బ్యాంక్ డీటైల్స్ చాలు సదరు మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో వచ్చిపడిపోతుంది. వెంటనే ఆలస్యం చేయకుండా కావాల్సిన వివరాలను అందజేయండి'' - ఇదీ ఓ ట్యాక్స్ పేయర్‌కు వచ్చిన ఈమెయిల్ సందేశం. సాధారణంగా ఎవరైనా దీన్ని నిజమే కాబోలు అనుకుంటారు. వాళ్ల దగ్గర డీటైల్స్ లేవేమో అనే ఉద్దేశంతో వివరాలు ఇవ్వొచ్చు. కానీ.. దీని వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

రీఫండ్స్‌లో ఆలస్యమే లేదు
ఈ మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరాల ప్రకారం గతేడాదికి సంబంధించిన రీఫండ్స్‌లో మొత్తం రూ.64700 కోట్లను తిరిగి ఇచ్చేశారు. వాస్తవానికి 2018-19కి సంబంధించి రూ.1,61,457 కోట్లను రీఫండ్ చేయాల్సి ఉంది. మొత్తంగా 7.19 కోట్ల ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేశారు కూడా.
ఇంత పెద్ద మొత్తంలో వేలాది మందికి రీఫండ్ ఉండడం వల్లే స్కామ్‌స్టర్స్ రంగంలోకి దిగారు. దీన్ని అదనుగా చూసుకుని మిమ్మల్ని టార్గెట్ చేసుకుని బుట్టలో పడేసి వేలాది రూపాయలను తస్కరించాలని చూస్తున్నారు.

ఎలా జాగ్రత్త పడాలి
సాధారణంగా మీరు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఈ రెండు సైట్లలోనే చేయాల్సి ఉంటుంది. www.incometaxindia.gov.in or www.incometaxindiaefiling.gov.in. ఇవి కాకుండా మీరు ఎక్కడ చేసినా మీ సమాచారం చోరీ అయ్యే అవకాశాలున్నాయి. మీకు ఒక వేళ రీఫండ్‌కు సంబంధించి ఏదైనా మెయిల్ వచ్చిందంటే.. ఒకటికి పదిసార్లు దాన్ని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వాటిల్లో ఏది కరెక్టో చెప్పడం అంత ఈజీ కాదు. పేర్లు అలానే ఉండే విధంగా స్కామ్‌స్టర్స్ తెలివితేటలను ప్రదర్శిస్తారు. సాధారణంగా అధికారికంగా వచ్చే మెయిల్స్‌కు రిప్లై ఆప్షన్ ఉండదు. మీరు ఎలాంటి రిప్లై పంపాల్సిన అవసరం ఉండదు. కానీ అదనపు సమాచారంతో దీనికి రిప్లై ఇవ్వండి అని ఉంటే మాత్రం జాగ్రత్తపడండి.
కొన్నిసార్లు మీ మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తూ ఉంటారు. రీఫండ్ త్వరగా కావాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి... వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటి జోలికి కూడా వెళ్లొద్దు.
అంతేకాదు ఐటీ శాఖ ఎప్పుడూ మీ బ్యాంక్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ వివరాలు, క్రెడిట్ కార్డ్ సమాచారం వంటివి ఎప్పుడూ అడగనే అడగదు. మీరు ఏం చేసినా ఇన్కం ట్యాక్స్ ఈ ఫైలింగ్ సైట్‌లోనే చేయాల్సి ఉంటుంది.

ఎలా కంప్లైంట్ చేయాలి
ఒక వేళ మీరు మోసపోయినా.. లేదా మీకు ఇలాంటి మెయిల్స్ వచ్చినా ఐటీ శాఖకు సమాచారం అందించండి. దానివల్ల ఇతరులు కూడా వాళ్ల బారినపడకుండా సహాయం చేసినవారవుతారు. ఒక వేళ మీకు వచ్చిన మెయిల్ సందేహాస్పదంగా అనిపించినా, లేకపోతే అనుమానంగా ఉన్నా.. ఈ కింద చెప్పిన మెయిల్స్‌కు సమాచారం అందించండి. ఒక వేళ మీరు మోసపోయినా సరే వీళ్లను సంప్రదిస్తే కొద్దిగా ఊరట లభించవచ్చు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications