హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగేళ్లలో 67 శాతం పెరిగాయి. విభజనకు ముందు రూ.90వేల కోట్లుగా ఉన్న అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.2,49,435 కోట్లుగా ఉంది. అయిదేళ్లలో చంద్రబాబు అప్పులు మూడింతలు చేశారని అధికారంలోకి వచ్చిన వైసీపీ విమర్శలు కూడా గుప్పిస్తోంది. ఏపీ అప్పులు నాలుగేళ్లలో 67 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విభజన సమయంలో ఏపీ లోటు బడ్జెట్‌లో ఉంది. అయితే మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణలో కూడా ఇదే కాలంలో భారీ ఎత్తున అప్పులు ఉన్నాయని, అయిదేళ్లలో అప్పులు 159 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో చెప్పారు.

అయిదేళ్లలో 129 శాతం పెరిగిన అప్పులు
2014 జూన్ 2తో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో రెట్టింపు అప్పులు చేసిన మాట వాస్తవమేనా? అని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంఎ ఖాన్ అడిగిన ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ అప్పులు రూ.69,517 కోట్లు ఉండగా, 2018-19 బడ్జెట్ నాటికి అవి రూ.1,80,239 కోట్లకు చేరాయని తెలిపారు. 2019 మార్చి నాటికి లెక్కల ప్రకారం అయిదేళ్లలో 159 శాతం పెరిగాయని చెప్పారు.

FRBM పరిధికి మించి కేంద్రం అనుమతులు
డిస్కమ్స్ రుణ భారం స్వీకరించడానికి వీలుగా కేంద్రం FRBM పరిధికి మించి ఒకసారి అదనపు రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందని, ఉదయ్ స్కీం కింద 2016-17లో మరోసారి రూ.8,923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతిచ్చామని పేర్కొన్నారు.

అప్పులు ఇలా పెరిగాయి
2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రుణభారం రూ.79,880 కోట్లు, 2015-16లో రూ.97,992 కోట్లు, 2016-17లో రూ.1,34,738 కోట్లు, 2017-18లో రూ.1,51,133 కోట్లు, 2018-19లో రూ.1,80,239 కోట్లుగా ఉందని తెలిపారు. వడ్డీలు, రుణాల చెల్లింపు వరుసగా 2014-15లో రూ.5,593 కోట్లు, 2015-16లో రూ.7,942 కోట్లు, 2016-17లో రూ.8,609 కోట్లు, 2017-18లో రూ.11,139 కోట్లు, 2018-19లో రూ.11,691 కోట్లుగా ఉంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications