న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్ వంటి దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఇరాన్ నుంచి చుమురు దిగుమతులు చేసుకోవద్దని ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (UAE) భారత్‌కు అవసరమైన చమురు దిగుమతి చేసేందుకు ముందుకు వచ్చింది.

భారత్‌కు యూఏఈ చేయూత
ఇదివరకు కూడా చమురు సమస్య వచ్చినప్పుడు భారత్‌కు తాము సరఫరా చేశామని, ఇప్పుడు కూడా లోటు పూడ్చుతామని యూఏఈ హామీ ఇచ్చిందని భారత్‌లోని ఆ దేశ రాయబారి అహ్మద్ ఆల్ బన్నా అన్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపేయాలని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇది మే నెల మొదటి వారంలోనే ముగిసింది. అమెరికా కొనుగోలుదారులతో చేసుకున్న ఒప్పందం గత మే నెలలో ముగియడంతోనే ఇరాన్ నుంచి చమురు దిగుమతిని భారత్ నిలిపివేసింది.

హార్మూర్ జలసంధిపై ట్రంప్
ఇరాన్ - అమెరికా ఘర్షణ భారత్, చైనా ఇంధన సరఫరాపై కూడా ప్రభావం చూపిస్తోంది. మరోవైపు, హార్మూర్ జలసంధి వద్ద చమురు ట్యాంకర్లపై దాడి, అమెరికా ౌకాదళ డ్రోన్‌ను ఇరాన్ బలగాలు కూల్చి వేయడంతో ఇరుదేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ట్వీట్ చేస్తూ... చైనా 91శాతం, జపాన్ 62శాతం చమురు ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి నుంచే వెళుతున్నాయని, అలాంటప్పుడు ఇతర దేశాల కోసం ఈ జలసంధిలోని నౌకామార్గాలను తాము ఫ్రీగా ఎందుకు కాపాడాలని, నిత్యం ప్రమాదకరంగా ఉండే ఈ మార్గంలో ఆ దేశాలే వారి నౌకలను రక్షించుకోవాలని, అసలే ఇది ప్రమాదకరమైన ప్రయాణమని, ఇక్కడ ఉండాల్సిన అవసరం తమకైతే లేదని, అసలు ప్రపంచంలో అత్యధిక ఇంధనాన్ని తామే ఉత్పత్తి చేస్తున్నామని, తాము ఇరాన్‌ను అణ్వాయుధాలను ప్రోత్సహించవద్దని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. హార్మూర్ జలసంధి వద్ద ఎవరి ఆయిల్ ట్యాంకర్లు వారే రక్షించుకోవాలనేది ట్రంప్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

ఇండియా ఆపరేషన్ సంకల్ప్
అయితే మన నౌకలను రక్షించుకోవడానికి వీలుగా మనకు తగినన్ని బలగాలు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఆపరేషన్ సంకల్ప్ పేరుతో ఇప్పటికే నౌకలను రక్షిస్తోంది. ఇవే పర్షియన్ గల్ఫ్‌కు వెళ్లి మన ఆయిల్ ట్యాంకర్లను రక్షించుకొంటాయి. కానీ, చైనాకు ఈ ప్రాంతంలో పెద్దగా నౌకాదళం లేదు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications