న్యూఢిల్లీ: జూలై 5వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచువచ్చునని భావిస్తున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. అయితే, పన్ను శ్లాబ్ మాత్రం మార్చలేదు. కాబట్టి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చినందున పెంచే అవకాశాలు లేవని భావిస్తున్నారు.

జీరో ట్యాక్స్ అయినప్పటికీ రిటర్న్స్ ఫైల్
ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో మోడీ ప్రభుత్వం ఆదాయ పన్ను మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద మినహాయింపు ఇస్తున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అయినప్పటికీ ట్యాక్స్ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షల వరకు జీరో ట్యాక్స్ ఉన్నప్పటికీ రిటర్న్స్ ఫైల్ చేయవలసి ఉంటుంది.

రూ.3 లక్షలకు పెంచే అవకాశముందా?
ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే కనుక వాస్తవ రూపం దాల్చితే నేరుగా దాదాపు 5 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్‌కు నేరుగా ప్రయోజనం చేకూరుతుందట. వీరి వార్షిక ఆదాయపన్నులో అదనంగా రూ.2,500 ఆదా కానుందని చెబుతున్నారు. గత త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5.8 శాతంగా ఉండటంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పన్ను మినహాయింపును విస్తృతం చేయాలని చూస్తున్నారట.

రూ.5 లక్షలకు పెంచుతారంటూ...
అంతేకాదు, వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారని కూడా భావిస్తున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి రూ.5 లక్షల వరకూ పూర్తిగా పన్ను రిబేటును ప్రకటించినా, ఆదాయ పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పన్ను మినహాయింపుకు వార్షికాదాయ పరిమితి రూ 2.5 లక్షల శ్లాబును అలాగే ఉంచారు. 2014 నుంచి ఈ శ్లాబులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఆదాయానికి పన్ను రేటును 20 శాతంగా నిర్ధారించారు. దీనిని 10 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

రూ.2.5 లక్షలు దాటితే ఐటీఆర్ తప్పనిసరి
మీ ఆదాయం ఏటా ఆదాయం రూ.5 లక్షలుగా ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. జీరో ట్యాక్స్ కదా అని ఫైల్ చేయకుండా ఉండరాదు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి మీ రిబేటును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పీయూష్ గోయల్ తన ప్రసంగంలో... ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ రూ.5 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ పొందుతారని, వారు ఎలాంటి ఇన్‌కం ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే, రూ.2.5 లక్షలు మించితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మాత్రం తప్పనిసరి. సీనియర్ సిటిజన్లకు మినహాయింపు రూ.3 లక్షలు. సెక్షన్ 87(ఏ) కింద రూ.5 లక్షల వరకూ వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో కనీస వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రూ 2.5 లక్షల నుంచి పెంచకపోవచ్చని కూడా భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications