2019లో 1.61 లక్షల కోట్ల ఐటీ రీఫండ్స్ విడుదల, ఉద్దేశ్యపూర్వ ఎగవేతదారులు 8,582

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ-రిటర్న్స్ భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2017-18లో 5,47,30,304 ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో 18.65 శాతం పెరిగి, 6,49,39,586కు చేరుకుందన్నారు. 2018-19లో 7.19 లక్షల ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (ITRs) ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రిలీజైన రీఫండ్ అమౌంట్ రూ.1,61,457.6 కోట్లు అన్నారు. పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. కేవలం 0.5 శాతం ఐటీఆర్‌లు మాత్రమే స్క్రూటినీ కోసం ఉన్నాయని, ఎక్కువ భాగం ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేసి, రీఫండ్ చేసినట్లు తెలిపారు.

ECS ద్వారా రీఫండ్

ECS ద్వారా రీఫండ్

ఐటీఆర్ ప్రాసెసింగ్ కోసం సాంకేతికతను ఎక్కువగా వినియోగించామని, దీంతో ఐటీఆర్ ప్రాసెస్‌కు తక్కువ సమయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. జూన్ 18, 2019 నాటికి రీఫండ్‌కు సంబంధించి రూ.64,700 కోట్లు ఇప్పటికే ఇష్యూ చేసినట్లు తెలిపారు. 2019 మార్చి నుంచి ECS ద్వారా ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ అమౌంట్ నేరుగా బ్యాంకు అకౌంట్‌లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. ఎలాంటి సర్దుబాట్లు లేకుండా రూ.5,000 రీఫండ్ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవగాహన

ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవగాహన

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ పేయర్స్‌కు 26.9 కోట్ల ఎస్సెమ్మెస్‌లు, ఈ-మెయిల్స్ పంపించామని, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని వారికి గుర్తు చేసేందుకు వీటిని పంపించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ట్యాక్స్ పేయర్స్‌ను వివిధ మార్గాల ద్వారా ఎడ్యుకేట్ చేసినట్లు తెలిపారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఈ-ఫైలింగ్ ట్రెయినింగ్, వర్క్‌షాప్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 60 శాతం పెరిగారు

ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు 60 శాతం పెరిగారు

ఇదిలా ఉండగా, గత అయిదేళ్ల కాలంలో జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య అరవై శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ లోకసభలో స్పష్టం చేశారు. మార్చి 2019 నాటికి ఆ సంఖ్య 8,582గా ఉందన్నారు. ఈ మేరకు ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ సంఖ్య 5,349గా ఉందన్నారు. 2014-15 నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2015-16లో 6,575, 2016-17లో 7,079, 2017-18లో 7,535గా ఉందన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు వారికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి ప్రత్యేక సౌలభ్యాలు ఉండవని చెప్పారు. వారి సంస్థలపై కొత్త వెంచర్లకు సంబంధించి అయిదు సంవత్సరాల నిషేధం ఉంటుందని, గత అయిదు ఆర్థిక సంవత్సరాల కాలంలో వారి ఖాతాల నుంచి రూ.7,654 కోట్ల రికవరీ చేసినట్లు తెలిపారు. ఆర్బీఐ సూచనల ప్రకారం అవసరమైన కేసుల్లో నేర విచారణ ప్రారంభించామని, 2,915 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. 2016లో తీసుకువచ్చిన ఇన్‌సాల్వెన్సీ, బాంక్రప్టసీ కోడ్ ప్రకారం ఇన్‌స్వాలెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌లో పాల్గొనకుండా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మీద నిషేధం విధించామన్నారు. విదేశాలకు పారిపోయిన వారి కోసం గత ఏడాది ఫ్యుగిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ 2018 చట్టాన్ని తెచ్చామని తెలిపారు. కాగా, బ్యాంకుల నుంచి తాము తీసుకున్న అప్పులు చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ తిరిగి చెల్లించని సంస్థలు, వ్యక్తుల్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా పేర్కొంటారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+