బెంగళూరు: గ్లోబల్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య 9,000 మందికి పైగా అమెరికాలో ఉద్యోగాలు ఇచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన వారికే వర్క్ వీసాలు జారీ చేయడంతో పాటు, హెచ్1బీ వీసా హోల్డర్స్‌కు అధిక కనీస వేతనం నిబంధనలను తీసుకు వస్తున్న సమయంలో ఇన్ఫోసిస్ అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అమెరికాలో తమ సంస్థ బలపడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇన్ఫోసిస్ భావిస్తోంది.

అమెరికన్లకు ఉద్యోగాలు
2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు తాము 9,100 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇది తమ బిజినెస్ మోడల్‌ను మరింత బలోపేతం చేస్తుందని, ప్రతిభ ఉన్నవారిని నియమించుకునేందుకు వీసాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని కంపెనీ సీవోవో యూపీ ప్రవీణ్ రావు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో తాము 10,000 మంది అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు ఇస్తామని, నాలుగు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని 2017 మేలో ఈ కంపెనీ ప్రకటించింది. ఈ రెండేళ్లలో 9,100 మందికి కొలువులు ఇచ్చిన ఇన్ఫోసిస్... త్వరలో ఈ లక్ష్యానికి (పదివేలు) చేరుకోనుంది.

ఉత్తర అమెరికా అతిపెద్ద మార్కెట్
ఇన్ఫోసిస్‌కు నార్త్ అమెరికా అతి పెద్ద మార్కెట్. మార్చి 31, 2019 రికార్డ్స్ ప్రకారం... ఇక్కడి నుంచి 61.2 శాతం రెవెన్యూ వస్తుంది. ఆ తర్వాత యూరోప్ నుంచి 24 శాతం, మిగతా దేశాల నుంచి 12.5 శాతం ఉంది. ఇందులో భారత్ నుంచి వచ్చే రవెన్యూ 2.3 శాతం.

భారీ వృద్ధి నమోదు
కాగా, ఇన్ఫోసిస్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 24,016 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఈ టెక్ దిగ్గజం ఉద్యోగుల సంఖ్య 2,28,123కు చేరుకుంది. మార్చి క్వార్టర్ ముగింపు నాటికి ఇన్ఫోసిస్ 10.51 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏకీకృత నెట్ ప్రాఫిట్ రూ.4,078గా ఉంది. అంతకుముందు ఏడాది రూ.3,690గా ఉంది. 2019 మార్చి క్వార్టర్‌లో నెట్ సేల్ 19.1 శాతం పెరుగుదలతో రూ.21,539 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.18,083 కోట్లుగా ఉంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications